టాలీవుడ్ నటీ నటులు నరేష్ ఇంకా పవిత్ర లోకేష్ ఈ ఇద్దరు కూడా ప్రేమలో ఉన్నారని ఆమెను నరేష్ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని గత కొన్నిరోజులుగా అనేక వార్తలు వైరల్ అయ్యాయి. కాగా ఆ వార్తల పై నరేష్ స్పందిస్తూ అవన్నీ కూడా ఒట్టి పుకార్లేనని మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అని కొట్టి పడేసారు.కానీ ఈ ఇద్దరు ఎక్కడికక్కడే ఎక్కువగా కలిసి కనిపిస్తున్నారు.ఇంకా పదికి పైగా సినిమాలలో కూడా ఇద్దరూ నటించారు. అంతేకాకుండా నరేష్ ఆమెను తన ఫ్యామిలీకి కూడా పరిచయం చేశారు. ఇవన్నీ చూసిన నెటిజన్స్ అందరూ కూడా ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు అంటూ మాట్లాడుకుంటున్నారు. అయితే పవిత్ర లోకేష్ తన భర్తకు విడాకులు ఇంకా ఇవ్వలేదని అందువల్ల ఈ వివాహం ఆలస్యం అవుతుందని మరో టాక్ కూడా ఉంది.అయితే ఇందులో నిజం ఎంత ఉంది అనేది ఇంకా తెలియాల్సి ఉంది.ఇక నిన్నటికి నిన్న మైసూర్ లోని ఓ హోటల్ రూమ్ లో పవిత్ర నరేష్ లు ఉండగా నరేష్ మూడో భార్య రమ్య వచ్చి వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.


దీంతో ఒక్కసారిగా ఈ ఇద్దరు కూడా ట్రెండింగ్ అయ్యారు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరి వయసులకు సంబంధించి ఆరా తీయడం కూడా మొదలుపెట్టారు నెటిజన్స్. ఇక ఈ ఇద్దరికి ఏజ్ గ్యాప్ ఎంత అంటూ ఆరా తీస్తున్నారు.కాగా ఇక నరేష్ వయసు ప్రస్తుతం 62 ఏళ్లు. ఇంకా అలాగే పవిత్ర లోకేష్ వయసు 43 ఏళ్లు. ఈ ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్  వచ్చేసి 19ఏళ్లు. ఇంకా చెప్పాలంటే పవిత్ర మన సూపర్ స్టార్ మహేష్ బాబు కంటే కూడా చిన్నది.మహేష్ వయస్సు 46 ఏళ్ళు. అంటే ఈమె మహేష్ కంటే 3 ఏళ్ళు చిన్నది.అయితే ఇప్పుడు నరేష్, పవిత్ర పెళ్లి వార్తలు మాత్రం సోషల్ మీడియాని బాగా షేక్ చేస్తున్నాయి.ఇంకా ఓవైపు వివాదాలు కూడా తెచ్చిపెడుతున్నాయి. మరి చూడాలి అసలు ఏం జరుగుతుందనేది. ఈ ఇద్దరూ వివాహం చేసుకుంటారా లేక ఈ రిలేషన్ ని ఇలానే కంటిన్యూ చేస్తారా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: