ప్రభాస్ మొదలుపెట్టిన పాన్ ఇండియా సినిమాల ప్రభంజనం ఇప్పుడు అందరు హీరోలు అనుసరిస్తూ వరుస పాన్ సినిమాలు చేస్తున్నారు. టాలీవుడ్ సినిమా పరిశ్రమలో క్రేజ్ లేని చిన్న హీరోలు సైతం ఈ విధమైన సినిమాలు చేసే విధంగా ధైర్యం చేస్తుండగా ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ లు గా సెట్ అయిన వారిలో కొంత భయం మొదలైంది. దానికి కారణం ప్రేక్షకుల అంచనాలను వారు అందుకోకపోవడమే. ప్రభాస్ విషయానికి వస్తే ఆయన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా దేశ వ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు.

సినిమా తర్వాత ఆయనపై ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తప్పకుండా ఈ హీరో మంచి సినిమాలు చేసి మళ్లీ మళ్లీ ప్రేక్షకులను అలరిస్తాడని అందరూ అనుకున్నారు. అన్ని అంచనాల మధ్య విడుదలైన ఆయన రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అవడంతో ఇప్పుడు ఏ విధంగా ప్రేక్షకులను అలారించాలో అన్న ఆలోచన ప్రభాస్ లో కలిగింది. నార్మల్ హీరో అయి ఉంటే చిన్నపాటి సినిమా చేసినా కూడా అది ప్రేక్షకులను ఆనందపరిచేది.

కానీ పెద్ద హీరో కాబట్టి తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అన్ని జోనర్ లను ఇష్టపడే ప్రేక్షకులను ఇప్పుడు అలరించవలసి వస్తుంది. ఆయన సినిమాలు కూడా ఆ విధంగానే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా ఇలాంటి భయం యశ్ లోను కలిగిందని అంటున్నారు. కే జి ఎఫ్ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న ఆయన తదుపరి సినిమాలతో ఆ స్థాయి విజయాన్ని అందుకోవాలి. అప్పుడే తన స్టార్ డం ను కొనసాగిస్తాడు. లేదంటే ప్రభాస్ పడిన సందేహంలో ఆయన ఉన్నాడట. దాంతో పాన్ ఇండియా హీరోలుగా ఎవరైనా వారు తప్పకుండా ఈ విషయంపై చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని కొంతమంది సినిమా విశ్లేషకులు చెబుతున్నారు. రాబోయే కాలంలో మరింతమంది పాన్ ఇండియా స్టార్స్ పుట్టుకు రాబోతున్న నేపథ్యంలో వారు దీనిపై కాస్త జాగ్రత్తగా అడుగులు ముందుకు వేయాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: