నదియా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఇక ఈమె హీరోయిన్ గా చాలా సినిమాల్లోనే చేసింది. కానీ ఓ హీరోతో యాక్ట్ చేయడం వల్ల అదే ఇక ఆమె హీరోయిన్ కెరీర్ని నాశనం చేసిందట.ఇక భాష ఏదైనా సరే సినిమా హిట్టయితే చాలు అందులో హీరోయిన్స్ ఫేమస్ అయిపోతారు.ఇంకా ఆ జోడి వరుస సినిమాలు చేసి హిట్స్ కొట్టేస్తుంది. ఇండస్ట్రీతో పాటు ఫ్యాన్స్ అందరూ కూడా ఎక్కువగా వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు. ఈ లిస్టులో ఎన్టీఆర్-శ్రీదేవి, వెంకటేష్-సౌందర్య, చిరంజీవి-రాధిక, బాలకృష్ణ-సిమ్రాన్ లాంటి కాంబోలు కూడా చాలా హిట్స్ కొట్టాయి.అభిమానులకు కూడా ఈ జోడీలంటే చాలా క్రేజ్ ఉండేది. ఇక స్టార్ హీరోల సంగతి అటుంచితే మీడియం రేంజ్ హీరోలు ఇలా రిపీట్ గా మూవీస్ లో యాక్ట్ చేశారంటే వాళ్ల మధ్య కూడా ఏదో ఉందనే గుసగుసలు వచ్చేస్తాయి.ఇక ఇలాంటి సంఘటనే సురేష్-నదియా కాంబినేషన్ విషయంలో కూడా జరిగింది. సురేష్ తండ్రి రైటర్ ఇంకా డైరెక్టర్ కావడంతో ఈ హీరో ఇండస్ట్రీలోకి సులువుగానే ఎంట్రీ ఇచ్చేశారు. తమిళంలో సురేష్ ఇంకా నదియాతో ఓ సినిమా చేశారు. అది కాస్త హిట్ అవడంతో ఈ జోడి బాగా ఫేమస్ అయింది. అలా సురేష్ ఇంకా నదియా కాంబినేషన్ పై డైరెక్టర్స్ కనపడింది. దీంతో వీళ్లను హీరో హీరోయిన్లుగా పెట్టి కూడా పలు సినిమాలు తీశారు. ఇక వీరి కాంబినేషన్లో సినిమాలు రావడమే కాదు అవి హిట్టు కూడా అయ్యాయి.


దీంతో వీరిద్దరూ కూడా లవ్ చేసుకుంటున్నారని త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారని తమిళంలో అప్పుడు గాసిప్ అయింది. కెరియర్లో అప్పుడప్పుడే ఎదుగుతున్న సురేష్ తో పాటు నదియాకు కూడా ఈ గాసిప్స్ చాలా తలనొప్పిగా మారాయి.ఇక ఈ న్యూస్ ని కొట్టిపారేసిన సురేష్ ఇక నదియాతో నటించే ఛాన్స్ వచ్చినా సరే రిజెక్ట్ చేస్తూ వచ్చాడట. మరోవైపు నదియాకు కూడా సినిమా ఛాన్సులు తగ్గిపోయాయి. దాంతో ఇక నదియా పేరెంట్స్ అమెరికా ఎన్నారై తో ఆమెకు పెళ్లి చేసి పంపించారు.హీరో సురేష్ కూడా హీరోయిన్ అనిత రెడ్డిని మ్యారేజ్ చేసుకున్నారు. అలా హీరోయిన్ గా సక్సెస్ అవ్వాల్సిన నదియా సడన్ గా ఓ గాసిప్ వల్ల తన కెరియర్ స్టాప్ చేయాల్సి వచ్చింది. ఆ తరువాత తమిళంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన నదియా  మిర్చి మూవీతో కూడా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీ అయిపోయింది. అత్తారింటికి దారేది, దృశ్యం, అఆ ఇంకా రీసెంట్ గా వచ్చిన సర్కారు వారి పాట సినిమాల్లో కీ రోల్స్ కూడా చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: