సినిమా ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోయిన్లు ప్రతి సంవత్సరం ఎంట్రీ ఇస్తూ ఉంటా.రు కానీ వారిలో కొద్ది మందికి మాత్రమే నటించిన మొదటి సినిమాతోనే అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయం మరియు అలాగే సూపర్ క్రేజీ లభిస్తుంటాయి. నటించిన మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయం మరియు సూపర్ క్రేజ్ ని సంపాదించుకున్న ముద్దుగుమ్మలలో కృతి శెట్టి ఒకరు.

కృతి శెట్టి  'ఉప్పెన' మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకోవడం మాత్రమే కాకుండా సూపర్ క్రేజ్ ను కూడా సంపాదించుకుంది. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న కృతి శెట్టి తాజాగా రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన ది వారియర్ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు తమిళ క్రేజీ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వం వహించగా,  ఈ మూవీ లో ఆది పినిశెట్టి ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. ఈ మూవీ ని జూలై 14 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో ది వారియర్ మూవీ హీరోయిన్ కృతి శెట్టి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.

తాజా ఇంటర్వ్యూలో భాగంగా కృతి శెట్టి అనేక ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. తాజా ఇంటర్వ్యూలో భాగంగా ప్రతి శెట్టి కి మీకు డ్రీమ్ రోల్ ఏదైనా ఉందా అనే ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు కృతి శెట్టి సమాధానం ఇస్తూ... నాకు డ్రీమ్ రోల్ ఉంది ... కానీ అది ఇప్పుడు కాదు ... కొన్ని సంవత్సరాల తర్వాత యాక్షన్ పాత్ర చేయాలని ఉంది అని కృతి శెట్టి చెప్పుకొచ్చింది.  మరి ఇప్పటికే ఉప్పెన , బంగార్రాజు , శ్యామ్ సింగరాయ్ మూవీ ల విజయాలతో మంచి జోష్ మీద ఉన్న కృతి శెట్టి 'ది వారియర్' మూవీ తో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: