టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీని శాసించే ఆ నలుగురులో దిల్ రాజ్ ఒకరు అని అంటూ ఉంటారు. ఎంతో రిస్క్ తో కూడుకున్న సినిమా బిజినెస్ చాలతెలివిగా చేస్తాడు అన్న పేరు దిల్ రాజ్ కు ఉంది. సమ్మర్ సీజన్ ముగింపుకు వచ్చిన దగ్గర నుండి గత ఆరు వారాలుగా వరసగా సినిమాలు ఫెయిల్ అవుతున్నాయి. ‘అంటే సుందరానికి’ ‘విరాటపర్వం’ ‘పక్కా కమర్షియల్’ ‘వారియర్’ ఇలా అంచనాలు ఉన్న సినిమాలు అన్నీ ఫెయిల్ అయ్యాయి.


ఇప్పుడు ఈలిస్టులోకి ‘థాంక్యూ’ మూవీ కూడ చేరిపోయింది. ఈమూవీ ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకున్నప్పటికీ నిర్మాత దిల్ రాజ్ సేఫ్ అంటూ ప్రచారం జరుగుతోంది. దీనికికారణం చాలతెలివిగా ఈమూవీ బడ్జెట్ ను కంట్రోల్ లో పెట్టుకుని ఈమూవీని దిల్ రాజ్ పూర్తి చేసాడు అని అంటున్నారు. ఈసినిమా ఫైనల్ కాపీ చూసిన తరువాత దిల్ రాజ్ కు ఈసినిమా విషయం అర్థం అయిపోయిందని అందుకే ఈమూవీని చాలతక్కువ రేట్లకు అసలకు నష్టం లేకుండా అమ్మడం ద్వారా దిల్ రాజ్ సేఫ్ అయ్యాడు అని అంటున్నారు.




అంతేకాదు ఈమూవీ ఓటీటీ రేట్స్ ను సోనీ లివ్‌ కు 12కోట్లకు డిజిటల్ రైట్స్ శాటిలైట్ అమ్మకం ద్వారా దిల్ రాజ్ పెట్టిన పెట్టుబడి వచ్చిందని అంటున్నారు. తన గత చిత్రం ‘ఎఫ్ 3’ మూవీ బయ్యర్లకు కొంతమేరకు నష్టాలు రావడంతో ఆనష్టాలకు పరిహారంగా ‘థాంక్యూ’ రైట్స్ ని ఇచ్చి దిల్ రాజ్ చాల తెలివిగా వ్యవహరించాడు అని అంటున్నాడు.


అయితే ఈమూవీ టాక్ తో పాటు ఊహించని విధంగా మళ్ళీ తెలుగు రాష్ట్రాలలో విపరీతంగా వానలు వస్తున్న పరిస్థితులలో కేవలం సినిమాలు అంటే మోజున్న వర్గం తప్పించి సగటు ప్రేక్షకులు ఈమూవీకి వచ్చే అవకాశం చాలతక్కువ అని అంటున్నారు. ఈసినిమా ప్రమోషన్ ను భారీగా చేయకుండా ఈమూవీ గురించి మరీ ఎక్కువగా చెప్పి అంచనాలు పెంచకపోయినా ఈమూవీ మరీ స్లోగా ఉండటంతో ఈమూవీని చూడలేము అంటూ కొందరు సోషల్ మీడియాలో థాంక్యూ అని మెసేజ్ లు పెట్టడం హాట్ టాపిక్ గా మారింది..    


మరింత సమాచారం తెలుసుకోండి: