జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న అనసూయ ప్రస్తుతం వరుస మూవీ లలో నటిస్తున్న విషయం మన అందరికి తెలిసిందే. ఒక వైపు టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరిస్తూ నే మరో వైపు సినిమాల్లో నటిస్తున్న అనసూయ తాజాగా వాంటెడ్ పండుగాడు అనే మూవీ లో కీలక పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. 

మూవీ లో అనసూయ తో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ లో కమెడియన్ గా అదిరిపోయే గుర్తింపు తెచ్చుకొని ఆ తరువాత హీరోగా కూడా కొన్ని విజయాలను అందుకని ప్రస్తుతం కమెడియన్ గా , విలన్ , ఇతర అనేక పాత్రలలో నటిస్తున్న సునీల్ కూడా ఈ మూవీ లో ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. వీరితో పాటు వాంటెడ్ పండుగాడు మూవీ లో బ్రహ్మానందం, వెన్నెల కిషోర్‌, సుడిగాలి సుదీర్ , సప్తగిరి ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ కి శ్రీధర్‌ సీపాన దర్శకత్వం వహించగా , సాయిబాబ కోవెలమూడి, వెంకట్‌ కోవెలమూడి ఈ మూవీ కి నిర్మాతలు. ఇది ఇలా ఉంటే తాజాగా వాంటెడ్ పండుగాడు చిత్ర బృందం ఈ మూవీ కి  సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను విడుదల  చేసింది.  

తాజాగా వాంటెడ్ పండుగాడు చిత్ర బృందం ఈ మూవీ ని ఆగస్ట్ 19 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ పోస్టర్ సునీల్ , అనసూయ ,  సుడిగాలి సుదీర్ , బ్రహ్మానందం ,  సప్తగిరి  మరియు తదితరులు ఉన్నారు. మరి ఈ సినిమా ఏ రేంజ్ విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకుంటుందో తెలియాలంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: