సూపర్ స్టార్ రజనీ కాంత్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . రజినీ కాంత్ కేవలం ఇండియాలో మాత్రమే కాకుండా తన సినిమాలతో ఇతర దేశాలలో కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు . ఇప్పటికే కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించి తమిళ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న సూపర్ స్టార్ రజినీ కాంత్,  శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన రోబో సినిమా తర్వాత అలాంటి విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకోలేకపోయాడు.

ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితమే రజనీ కాంత్ అన్నాత్తే సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమా తెలుగులో పెద్దన్న పేరుతో విడుదల అయ్యింది. ఈ సినిమా తమిళనాట పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకున్నప్పటికీ టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర మాత్రం పెద్దగా ప్రభావం చూపలేదు. ఇది ఇలా ఉంటే రజనీ కాంత్ తన తదుపరి సినిమా కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయిన నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో చేయబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు జైలర్ అనే పవర్ఫుల్ టైటిల్ ను కూడా మూవీ యూనిట్ ఓకే చేసింది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ని సెప్టెంబర్ నెలలో సెట్స్ పైకి తీసుకు వెళ్ళబోతున్నట్లు తెలుస్తోంది.  ఈ మూవీ కోసం హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ లో భారీ జైల్ సెట్ ను కూడా మూవీ యూనిట్ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కి అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించబోతున్నడు. ఈ మూవీ లో రజనీ కాంత్ సరసన ఐశ్వర్యా రాయ్ హీరోయిన్ గా నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: