బుల్లితెరపై హీరో రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్నాడు సుడిగాలి సుదీర్. సాధారణంగా బుల్లితెర ప్రేక్షకులను అలరించాలని అంటే అటు సీరియల్ వాళ్ళు గాని లేదా కమెడియన్స్ గానీ ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. కానీ సుడిగాలి సుధీర్ కి ఆ  అవసరం లేనేలేదు. ఎందుకు అంటే సుడిగాలి సుదీర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఏదో ఒకటి చేయాల్సిన పనిలేదు. స్టేజి మీద సుడిగాలి సుదీర్ అలా నడుచుకుంటూ వస్తే చాలు ప్రేక్షకులు అది చూసిమెరిసి పోతూ ఉంటారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆ రేంజ్ లో సుడిగాలి సుదీర్ ప్రస్తుతం బుల్లితెరపై క్రేజ్ సంపాదించుకున్నాడు.


 జబర్దస్త్ అనే  కార్యక్రమంలో సాదాసీదా కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి తన టాలెంట్ తో బుల్లితెర ప్రేక్షకులందరికీ కూడా ఔరా అనిపించాడు అన్న విషయం తెలిసిందే. కేవలం కామెడీ చేయడమే కాదు అదిరిపోయే డాన్స్ పర్ఫార్మెన్స్ లు చేయడం.. ఇక అబ్బురపరిచే మ్యాజిక్ తో ఆశ్చర్య పరచడం చేస్తూ ఉంటాడు సుడిగాలి సుదీర్. అంతేకాదు యాంకరింగ్ తో అదరగొట్టడం.. పాటలు పాడుతూ మెస్మెరైజ్ చేయడం కూడా చేస్తూ ఉంటాడు. ఇలా చెప్పుకుంటూ పోతే సుదీర్ కు రాదు అనేది ఏది  లేదు అని అనిపిస్తూ ఉంటుంది అని చెప్పలేదు.

 అయితే ఇటీవల జబర్దస్త్ నుంచి తప్పుకున్న సుడిగాలి సుదీర్ స్టార్ మా లో ఒక పాటల కార్యక్రమానికి యాంకర్ గా చేస్తున్నాడు. ఇప్పటివరకు ఎన్నోసార్లు రష్మీ కోసం పాట పాడాడు సుధీర్. ఇటీవల మరోసారి సూపర్ సింగర్ జూనియర్ వేదిక మీద తన సింగింగ్ టాలెంట్  నిరూపించుకున్నాడు. సుధీర్ పాట పాడిన తీరు కి అందరూ ఫిదా అయిపోయారు. సింగర్ చిత్ర అయితే సుధీర్ పాటకి ఫిదా అయ్యి  ఈ పాటకు స్టాండింగ్ ఒవేషన్ ఇవ్వాల్సిందే అంటూ చెప్పింది. అందం హిందోళం అనే పాట పాడాడు సుధీర్. ఇక హేమచంద్ర సైతం సుదీర్ టాలెంట్ ని పొగడ్తలతో ముంచెత్తాడు. దీంతో సుధీర్  అభిమానులూ మరచిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: