రౌడీ స్టార్
విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లైగర్
సినిమా ఆగస్టు 25వ తేదీన విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. విడుదలకు నెల రోజుల ముందు నుంచే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్లు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల చేసి దేశవ్యాప్తంగా మంచి బజ్ సినిమాకు తీసుకొచ్చారు. బాక్సర్ గా ఈ చిత్రంలో కనిపించబోతున్న
విజయ్ దేవరకొండ మరొకసారి తన టాలెంట్ ను ఇక్కడ చూపించబోతున్నారు.
మొదట్లో చిన్న దర్శకులతో కొత్త దర్శకులతో సినిమాలు చేసిన
విజయ్ దేవరకొండ ఇప్పుడు పూరీ జగన్నాథ్ లాంటి అగ్ర దర్శకుడు తో
సినిమా చేయడం విశేషం. ఇటు
పూరి జగన్నాథ్ కు కూడా ఈ
సినిమా ఎంతో కీలకమన చెప్పాలి. ఆయన దర్శకత్వం వహించిన
ఇస్మార్ట్ శంకర్ సంచలన విజయాన్ని అందుకున్న నేపథ్యంలో ఆ తర్వాత చేస్తున్న ఈ
సినిమా భారీ విజయాన్ని అందుకోవడానికి ఆయన చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాను పాన్
ఇండియా స్థాయిలో తరికెక్కించి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాడు.
గతంలో ఎంతటి స్థాయిలో ఇంతటి సమయాన్ని తీసుకునే సినిమాను
పూరి జగన్నాథ్ ఎప్పుడు చేయలేదని చెప్పాలి. ఆ విధంగా ఈ
సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలను కూడా భారీ స్థాయిలో చేపడుతున్న చిత్ర బృందం ఇప్పుడు మరొక భారీ అప్డేట్ కు సిద్ధమయ్యింది. ఈ సినిమాలో ఒక మంచి పాటకు శ్రీకారం చుట్టింది. రేపు ఉదయం 9 గంటలకు ఈ పాటను విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. ముంబైలో ఈ పాటను ఎంతో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారట. మరి
విజయ్ దేవరకొండ క్రేజ్ వేరే స్థాయి లో ఉన్న నేపథ్యంలో ఈ
సినిమా తప్పకుండా భారీ విజయాన్ని అందుకోవడం ఖాయం అని చెప్పాలి.
అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ
సినిమా ఏ స్థాయి లో ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.