అల్లు అర్జున్ హీరోగా రూపొందిన పుష్ప సినిమా సంచలన విజయం అందుకో వడంతో బన్నీ క్రేజ్ దేశ వ్యాప్తంగా భారీ స్థాయిలో పెరిగిపోయిందని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ సినిమా యొక్క రెండవ భాగం చిత్రం పై ప్రేక్షకులు ఎన్నో అంచనాలను పెట్టుకున్నారు. అయితే ఈ సినిమా ఎంతకీ మొదలు పెట్టకపోవడం బన్నీ అభిమానులను ఎంతగానో నిరాశ పరుస్తుంది. డిసెంబర్ లో విడుదలైన పుష్ప సినిమాను వెంటనే మొదలు పెడతారని ప్రేక్షకులు భావించారు.

కానీ ఆ సినిమా విడుదలైన ఎనిమిది నెలలు అవుతున్నా కూడా ఇంకా ఈ సినిమాను మొదలు పెట్టక పోవడం అందరిని ఎంతగానో ఆశ్చర్యపరుస్తుంది. కారణం ఏదైనా కూడా అల్లు అర్జున్ ఇన్ని నెలలు అయినా సినిమాను మొదలు పెట్టకపోవడం నిజంగా నిరాశపరిచే విషయం అనే చెప్పాలి. ఈ గ్యాప్ లో ఓ సినిమాను చేసి ఉంటే బాగుండేదని కూడా ప్రేక్షకులు సలహా ఇస్తున్నారు. ఇంత సమయం తీసుకోబడుతుందని వారు కూడా ఊహించలేదు కాబట్టి అల్లు అర్జున్ ఇంత సమయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని బన్నీ తరపు వర్గం వారు చెబుతున్నారు. 

ఇకపోతే సుకుమార్ నార్త్ సైడ్ ప్రేక్షకులకు కూడా ఈ సినిమా బాగా నచ్చే విధంగా తీర్చిదిద్దబో తున్నాడట. పలు ఆసక్తికర అంశాలను కూడా ఈ చిత్రం లో కలపబోతున్నాడట. ఆ విధంగా సుకుమార్ ఈ చిత్రం తో ఏ స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తాదో చూడాలి. మొదటి భాగంలో ఎన్నో విశేషాలను ఇమిడిం చిన సుకుమార్ రెండవ భాగంలో కూడా అంతకంటే ఎక్కువ విశిష్టతలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. స్క్రిప్ట్ దశలో నే ఆయన ఈ సినిమా బాగుండేలా చూసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ఇప్పుడు వినిపిస్తున్న వార్తలను బట్టి తెలుస్తుంది. మరి ఈ సినిమాను ఇప్పుడు మొదలుపెట్టి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: