కన్నడ స్టార్ హీరోలలో ఒకరు అయినా కిచ్చ సుదీప్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈగ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన సుదీప్ ఆ తర్వాత బాహుబలి , సైరా నరసింహారెడ్డి లాంటి భారీ బడ్జెట్ తెలుగు మూవీ లలో కూడా నటించి ప్రేక్షకులను అలరించాడు. ఇలా సుదీప్ నేరుగా కొన్ని తెలుగు మూవీ లలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు.

ఇది ఇలా ఉంటే తాజాగా కిచ్చ సుదీప్ 'విక్రాంత్ రోనా' అనే అడ్వెంచరస్ థ్రిల్లర్ మూవీ లో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ జూలై 28 వ తేదీన కన్నడ తో పాటు తెలుగు , తమిళ , హిందీ , మలయాళ భాషల్లో విడుదల అయ్యింది. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా మంచి పాజిటివ్ టాక్ రావడంతో ప్రస్తుతం ఈ మూవీ కి బాక్సా ఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లు దక్కుతున్నాయి. ఈ సినిమా ఇప్పటి వరకు 5 రోజుల బాక్సా ఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకుంది. 6 రోజులకు గాను విక్రాంత్ రోనా మూవీ ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల గురించి తెలుసుకుందాం.

కర్ణాటక లో :  50.15 కోట్లు .
రెండు తెలుగు రాష్ట్రాలలో : 7.00 కోట్లు .
తమిళనాడు లో :  2.45 కోట్లు .
కేరళ లో :  0.76 కోట్లు .
హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో :  10.90 కోట్లు .
ఓవర్ సీస్ లో :  4.60 కోట్లు .
6 రోజులకు గాను విక్రాంత్ రోనా మూవీ ప్రపంచ వ్యాప్తంగా 40.15 కోట్ల షేర్ , 75.86  కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. అనూప్ బండరీ ఈ మూవీ కి దర్శకత్వం వహించగా ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: