తెలుగు సినీ ఇండస్ట్రీలో కొన్ని సంవత్సరాల పాటు అగ్ర కథానాయకుడు ఎదిగింది హీరోయిన్ కాజల్ అగర్వాల్. ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ తన కుటుంబానికి తన వ్యక్తిగత జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంది. కాజల్ వివాహం అయిన తర్వాత కూడా సినిమాలలో నటించే అవకాశాలు దక్కించుకున్నది. అయితే ఆమె ఆ సినిమాలలో కొన్నింటిని మాత్రమే పూర్తి చేసినట్లు తెలుస్తోంది.. ఇండియన్-2 చిత్రం చాలా రోజుల క్రితమే నటించడానికి ఒప్పుకోవడం జరిగింది . అయితే పలు రకాల కారణాల వల్ల ఈ సినిమా వివాదాస్పందంగా మారుతూ వస్తోంది..మొత్తానికి ఈ సినిమా క్యాన్సిల్ చేస్తారని అందరూ అనుకున్నారు కానీ నిర్మాణ సంస్థకు మరియు డైరెక్టర్ శంకర్కు మధ్య రాజీ కుదరడంతో ఈ సినిమా షూటింగ్ అని కొద్ది రోజులు నిలిపివేశారు. ఇక దీంతో ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ రామ్ చరణ్ తో RC -15 మన సినిమాని పూర్తి చేయబోతున్నారు. ఈ సినిమా అయిపోయిన వెంటనే ఇండియన్ -2 చిత్రం షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అయితే గతంలో కాజల్ పై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించిన ఇప్పుడు ఆమె షూటింగ్ వచ్చే పరిస్థితి లేదు కారణంగా ఆ సన్నివేశాలతో పాటు.. మరొక కొత్త హీరోయిన్ ని ఎంపిక చేయాలని నిర్మాణ సంస్థ లైకా వారు నిర్ణయించుకున్నట్లు సమాచారం.


ఇటీవలే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకొనే, కత్రినా కైఫ్  ఈ సినిమాలో హీరోయిన్గా నటించేందుకు చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం వారిలో కమలహాసన్ జోడిగా ఎవరు అయితే బాగుంటుంది అనే విషయంపై వారు అభిప్రాయాన్ని సేకరించి ఆ హీరోయిన్ ఎంపిక చేసే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు దాదాపుగా కన్ఫామ్ అయినట్లే అన్నట్లుగా టాలీవుడ్ మీడియా వర్గాలు తెలియజేస్తున్నాయి. అయితే కమలహాసన్ ఇటీవలే విక్రమ్ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ సినిమా తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక అందుచేతనే ఇండియన్ -2 సినిమా పైన భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: