టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఎంత అభిమానమో ప్రతి ఒక్కరికి తెలిసిందే.కానీ గత కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ జరుగుతుందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఎట్టకేలకు బండ్ల గణేష్ తమపై వస్తున్న వార్తలకు స్పందించి వరుస ట్వీట్లు చేశారు. సందర్భం ఉన్నా.. లేకపోయినా పవన్ కళ్యాణ్ పై తన అభిమానాన్ని ట్వీట్స్ రూపంలో పొగడ్తల వర్షం కురిపిస్తూ ఉంటాడు బండ్ల గణేష్ . ఇక పవన్ హాజరైన సినిమా వేడుకల్లో బండ్ల గణేష్ స్పీచ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ముఖ్యంగా ఆయన మాట్లాడే మాటలు అన్నీ కూడా అక్కడ వేడుకకు మరింత అలంకరణగా అనిపిస్తాయని చెప్పవచ్చు.

కానీ ప్రస్తుత కాలంలో పవన్ కళ్యాణ్ హాజరవుతున్న ఫంక్షన్లకు బండ్ల గణేష్ కు ఆహ్వానం అందడం లేదు. భీమ్లా నాయక్ సినిమా ఫంక్షన్ కి  కూడా బండ్ల గణేష్ రాకుండా త్రివిక్రమ్ అడ్డుకున్నాడు అంటూ కొన్ని అనుచిత వ్యాఖ్యలు కూడా వైరల్ అయ్యాయి. అంతేకాదు పవన్ కళ్యాణ్ అభిమానితో బండ్ల గణేష్ మాట్లాడిన ఆడియో కాల్ లీక్ కావడంతో పెద్ద రచ్చయింది. ఇక అందులో నిజం లేదని కాల్ రికార్డులో ఉంది తన వాయిస్ కాదు అని బండ్ల సమర్దించుకున్నాడు. త్రివిక్రమ్ ను బండ్ల గణేష్ దూషించాడని నమ్ముతున్న పవన్ కళ్యాణ్ అతన్ని దూరం పెట్టాడు అనేది ఇండస్ట్రీలో టాక్.. ఆ తర్వాత వీరిద్దరూ కలిసిన సందర్భాలు లేవు. దీంతో వారిద్దరి మధ్య దూరం పెరిగిందని అందరూ అనుకున్నారు


కానీ  బండ్ల గణేష్ తాజాగా పవన్ కళ్యాణ్ నా దేవుడు పవన్ కళ్యాణ్ చిత్ర చరిత్రలో రికార్డులు తిరగరాసే ఒక మూవీ చేయాలని కోరుకుంటున్నాను అని కామెంట్ చేశాడు.  మిమ్మల్ని ప్రేమిస్తూ మీతో ప్రేమించబడుతూ సినిమా తీస్తే బ్లాక్ బస్టర్ అంటే కామెంట్ చేసాడుం ఇవన్నీ చూస్తుంటే బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ కి దగ్గర కావాలని చేస్తున్నాడు అనడంలో అతిశయోక్తి లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: