ఏ ఆర్ రెహమాన్.. ఈ పేరు వినిపిస్తే చాలు సంగీత ప్రేమికులు అందరూ కూడా ఉప్పొంగి పోతూ ఉంటారు అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటివరకు ఏ ఆర్ రెహమాన్ అందించిన అద్భుతమైన సంగీతం అలాంటిది. అయితే అందుకే ఏ ఆర్ రెహమాన్ పేరు ప్రపంచ సంగీతంలో ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు అని చెప్పాలి. ఇక ప్రస్తుతం భారతదేశంలో గర్వించదగ్గ సంగీతదర్శకుడిగా ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ప్రస్తుతం ఏదైనా సినిమాకి ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు అంటే చాలు అది ఊహకందని విధంగానే ఉంటుందని ప్రతి ఒక్క ప్రేక్షకుడిలో భావన ఉంటుంది.. ఆ రేంజ్లో ప్రేక్షకుల్లో  గుర్తింపు సంపాదించుకున్నాడు.


 అయితే ఒక గొప్ప సంగీత దర్శకుడిగా ప్రేక్షకులందరికీ తెలిసిన ఏ ఆర్ రెహమాన్ జీవితం మాత్రం ముళ్లబాట అన్నది ఎంతో మందికి తెలియదు. ఎన్నో కష్టాలను ఎదుర్కొని తాను అనుకున్నది సాధించిన  ఇప్పుడు గొప్ప సంగీత దర్శకుడిగా కొనసాగుతున్న ఎ.ఆర్.రెహమాన్ జీవితం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం అని చెప్పాలి. అయితే ఏ ఆర్ రెహమాన్ అసలు పేరు అది కాదట ఆయన అసలు పేరు ఏ ఎస్ దిలీప్ కుమార్ తన తండ్రి పేరు ఆర్ కె శేఖర్. మంచి పేరున్న మ్యూజిక్ కంపోజర్ కావడం గమనార్హం. అయితే నాలుగేళ్ల వయసులోనే మ్యూజిక్ అంటే ఇష్టం ఉండేదట ఏ ఆర్ రెహమాన్ కి. దాంతో దీంతో తండ్రిని ఒక గిటార్ కొనిపెట్టమని అడగగా కొనిచ్చాడట. చిన్నప్పటి నుంచి సంగీత పాఠాలు నేర్చుకుంటూ పెరిగాడు.

 ఒకానొక సమయంలో ఏ ఆర్ రెహమాన్ తొమ్మిది ఏళ్ళ వయసు ఉన్న సమయంలో ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడం కారణంగా తినడానికి తిండి కూడా లేని పరిస్థితిని ఎదుర్కొన్నాడు. ఇళయరాజా, రమేష్నాయుడు, రాజ్కోటీ లాంటి దిగ్గజ మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర కూడా పని చేశాడు ఏ ఆర్ రెహమాన్. అయితే కాఫీ యాడ్ కి రెహమాన్ అందించిన మ్యూజిక్ బాగా హిట్ కావడంతో ఇక మణిరత్నం ఆయనకు ఒక సినిమా లో మ్యూజిక్ డైరెక్టర్ గా ఛాన్స్ ఇచ్చాడట. దీంతో సినిమాలో అందించిన మ్యూజిక్ మారుమోగిపోయింది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అయితే ఒకానొక సమయంలో ఏ ఆర్ రెహమాన్ అక్క తీవ్రమైన జబ్బుతో బాధ పడింది. ఇలాంటి సమయంలో కొంతమంది స్నేహితులు చెప్పిన సలహా మేరకు అక్క జబ్బు  నుండి బయట పడితే ఇస్లాం మతాన్ని స్వీకరిస్థా ఒక దర్గా దగ్గర అనుకున్నాడట. ఇక ఆ తర్వాత  తన అక్క జబ్బు నుంచి బయటపడింది. దీంతో దిలీప్ కుమార్ కాస్త అల్లారఖా రెహమాన్ గా మారిపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: