నితిన్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం మాచర్ల నియోజకవర్గం ఈ శుక్రవారం విడుదల కావడానికి సిద్ధమవుతుంది. ఇప్పటికే టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో వరుస పరాజయాలు ప్రేక్షకులను నిరాశ పరచగా గతవారం విడుదలైన చిత్రాలు అందరిని ఎంతగానో ఆనందపరిచాయి. మంచి కంటెంట్ తో పాటు ప్రేక్షకులను ఎంగేజ్ చేసే అంశాలు కూడా ఉండడంతో ఆ చిత్రాలు అందరిని ఆకట్టుకోవడం మొదలుపెట్టాయి. ఆ విధంగా ఇప్పుడు ఏర్పడిన పలు పాజిటివ్ వైబ్స్ మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా మాచర్ల నియోజకవర్గం.

యంగ్ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం మాస్ ప్రేక్షకులను టార్గెట్ గా చేస్తూ రూపొందిన సినిమా కావడం విశేషం. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన పలు అప్డేట్లు మాస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోగా ఇప్పుడు చేస్తున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాలను అందుకుంటుందో అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. గత మూడు సినిమాలుగా ఏమాత్రం ప్రేక్షకులను అలరించలేకపోయాడు. దాంతో ఇప్పుడు చేస్తున్న సినిమా ద్వారా విజయాన్ని అందుకోవాలని నితిన్ గట్టి ప్రయత్నాలు చేయగా ఇప్పటివరకైతే సినిమాపై ఉన్న పాజిటివ్ వైబ్స్ రీత్యా ఏ స్థాయిలో ఇది విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ సంగీతం సమకూర్చగా ఈ పాటలకు మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా ఓ ఐటెం సాంగ్ కు అందరి దగ్గర నుంచి విశేషమైన స్పందన వచ్చింది. మరి ఈ సినిమా యొక్క విజయానికి ఇది ఎంతవరకు దోహదపడుతుందో అనేది చూడాలి. రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించగా ఈ సినిమా పొలిటికల్ నేపథ్యంలో రూపొందడం విశేషం. ఇప్పటిదాకా ఈ తరహా కథనం ఉన్న సినిమాలలో నితిన్ నటించ లేదు. లుక్కు పరంగా కూడా కొత్తగా కనిపిస్తున్న నితిన్ ఈ సినిమా ద్వారా మంచి విజయాన్ని అందుకోవాలని ఆయన అభిమానులు భావిస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: