టాలీవుడ్ ఇండస్ట్రీ లో హీరోగా తన కంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ను ఏర్పరచుకున్న మంచు విష్ణు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మంచు విష్ణు తన కెరియర్ లో ఢీ , దేనికైనా రెడీ , దూసుకెళ్తా వంటి విజయవంతమైన సినిమాల్లో నటించి హీరోగా తనకంటూ ఒక ఇమేజ్ ను టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఏర్పాటు చేసుకున్నాడు. ఇది ఇలా ఉంటే కొంతకాలంగా మాత్రం మంచు విష్ణు బాక్సా ఫీస్ దగ్గర సరైన విజయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా మంచు విష్ణు 'జిన్నా' అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో మంచు విష్ణు సరసన పాయల్ రాజ్ పుత్ , సన్ని లియోన్ లు హీరోయిన్ లుగా నటిస్తుండగా , ఈషాన్ సూర్యమూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. 

జిన్నా మూవీ కి ప్రముఖ రచయిత కోన వెంకట్ కథ , స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను మూవీ యూనిట్ తాజాగా విడుదల చేసింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి పాయల్ రాజ్ పుత్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో పాయల్ రాజ్ పుత్ లంగా వోని కట్టుకొని సాంప్రదాయబద్ధంగా ఉంది. అలాగే ఈ చిత్ర బృందం ఈ మూవీ లో పాయల్ రాజ్ పుత్ ... పచ్చళ్ళ స్వాతి పాత్రలో కనిపించబోతున్నట్లు కూడా అధికారికంగా ప్రకటించింది. మరి పాయల్ రాజ్ పుత్ 'జిన్నా' మూవీ తో ఎలాంటి విజయాన్ని మరియు ఎ రేంజ్ క్రేజ్ ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: