మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇప్పుడు పలు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. ఇప్పటికే గాడ్ ఫాదర్ సినిమా ను పూర్తి చేసి విడుదల కు సిద్ధం చేస్తున్న చిరంజీవి ఆ తర్వాత చేసిన భోళా శంకర్ సినిమా ను పూర్తి చేసే విధంగా ముందుకు పోతున్నాడు. ఈ రెండు సినిమాల షూటింగ్ లు ఒకేసారి పూర్తి చేసి వాటి పనులను పూర్తికి చేసిన చిరు విడుదల కూడా తక్కువ గ్యాప్ లో చేసేందుకు సిద్ధం చేస్తున్నాడు. అలా దసరా కి గాడ్ ఫాదర్ సినిమా ను విడుదల చేస్తున్న చిరు ఆ తర్వాత మంచి సమయం చూసుకుని భోళా శంకర్ సినిమా ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు

ఇకపోతే బాబీ దర్శకత్వంలో అయన చేస్తున్న సినిమా యొక్క షూటింగ్ శెరవేగంగా జరుగుతుంది. వాల్తేరు వీరయ్య అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా ఈ సినిమా ను వచ్చే ఏడాది వేసవి లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. అలా ఈ మూడు సినిమాలు తన స్థాయి లో చేస్తున్న చిరు ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో యువ దర్శకుడు వెంకీ కుడుములు తో అయన సినిమా చేస్తుండగా దేనికి సంబంధించి ఏ వార్త కూడా బయటకి రాకపోవడం నిజంగా ఆ సినిమా అభిమానులను నిరాశపరుస్తుంది.

కామెడీ ఎంటర్టైనర్ సినిమాలతో ఎంతో బాగా చిత్రీకరించే వెంకీ కుడుముల మెగా స్టార్ చిరంజీవి తో సినిమా ఒకే చేసుకోవడం నిజంగా గ్రేట్. ఇంత తక్కువ సినిమాల అనుభవంతో అయన ఈ ఛాన్స్ అందుకోవడం గొప్ప విషయం. అయితే ఎంతకీ ఈ సినిమా కి సంబంధించి షూటింగ్ మొదలు కాకపోవడం అసలు ఈ సినిమా ఉందా లేదా అన్న అనుమానాలను కలిగిస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించి ఓ క్లారిటీ వస్తే బాగుంటుంది అన్నది మెగా అభిమానుల ఆలోచన. మరి ఇపుడు చేస్తున్న మూడు సినిమాల తర్వాత దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు చిరంజీవి.

మరింత సమాచారం తెలుసుకోండి: