మాజీ ప్రపంచ సుందరిగా గుర్తింపు తెచ్చుకున్న ఊర్వశీ రౌతెలా గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటీవల ది లెజెండ్ సినిమాతో దక్షిణ భారతదేశంలోకి కూడా అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఒక్క సినిమాతో ఏకంగా 20 కోట్ల రూపాయల పారితోషకం తీసుకుంది. నిజానికి బాలీవుడ్ సినిమాలలో అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న ఊర్వశికి ఇలా శరవణన్ అవకాశమిచ్చి ఏకంగా 20 కోట్ల రూపాయల పారితోషకం ఇవ్వడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఒక ఇంటర్వ్యూలో నటి కం మోడల్ ఊర్వశి రౌతెళా మాట్లాడుతూ.. ఆర్పి అనే వ్యక్తి తనను కలవడానికి దాదాపు పది గంటలపాటు వేచి ఉన్నాడని, ఇక వారణాసిలో షూటింగ్ చేస్తున్నప్పుడు తనకు 17 మిస్డ్ కాల్స్ కూడా ఇచ్చాడు అని ఆమె పేర్కొంది.ఇకపోతే ఊర్వశి గతంలో క్రికెటర్ రిషబ్ పంత్తో డేటింగ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇక దీనిపై కూడా స్పందిస్తూ భారత వికెట్ కీపర్ తన ఇంస్టాగ్రామ్ కథనంలో కేవలం పాపులారిటీ కోసం ప్రజలు ఇంటర్వ్యూలలో ఎలా అబద్ధాలు చెబుతారు అనేది తమాషాగా ఉంది అంటూ తెలిపారు. ఇక కొన్ని నిమిషాలలోని క్రికెటర్ కూడా స్టోరీని తొలగించడం మరింత హాట్ టాపిక్ గా మారింది. ఇకపోతే వీళ్ళిద్దరి మధ్య మాటలు యుద్ధం గట్టిగానే నడుస్తుందని చెప్పవచ్చు. ఊర్వశి కూడా తన సోషల్ మీడియా ద్వారా ఒక పోస్ట్ తో అతనికి రిప్లై ఇచ్చి బాగా ఆడుకుందనే చెప్పాలి అందులో చోటు భయ్యా బ్యాట్ బాల్ ఆడాలి అని రాసి ఉంది.

అంతేకాదు అతన్ని కౌగర్ హంటర్ అని పేర్కొనడం జరిగింది. ఇక రక్షాబంధన్ శుభాకాంక్షలు కూడా తెలిపిన ఈమె మౌనంగా ఉన్న అమ్మాయిని ఉపయోగించుకోవద్దు అని హ్యాష్ ట్యాగ్ కూడా జోడించడం జరిగింది. అయితే ఇద్దరు కూడా ఎవరికి వారు పేర్లను బయట పెట్టుకోకపోవడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: