అందాల రాక్షసి, కృష్ణ గాడి వీర ప్రేమ గాధ, పడి పడి లేచే మనసు ఇంకా లై సినిమాలను తెరపైకి తీసుకువచ్చిన విభిన్నమైన దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చిన చిత్రం సీతారామం. గత రెండు సినిమాలు కూడా ఈ దర్శకుడికి చేదు అనుభవాన్ని మిగిల్చినప్పటికీ ఈసారి సీతారామం సినిమాపై అంత పెద్దగా ప్రభావం చూపలేదు. ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది.'సీతా రామం' ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో కలుపుకుని మంచి బిజినెస్ కూడా చేసింది. ఈ మూవీకి అన్ని ఏరియాస్ కలుపుకోని మొత్తం 18 కోట్ల దాకా బిజినెస్ జరిగింది.ఇక 'సీతా రామం' మూవీకి ఆంధ్ర, తెలంగాణలో 7వ రోజు కంటే 8వ రోజు అనూహ్యంగా కలెక్షన్లు కొంత పెరిగాయి. ఇక ఏరియాల వారిగా చూసుకుంటే నైజాంలో రూ. 30 లక్షలు, సీడెడ్‌లో రూ. 5 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 14 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 6 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 5 లక్షలు, గుంటూరులో రూ. 4 లక్షలు ఇంకా కృష్ణాలో రూ. 6 లక్షలు అలాగే నెల్లూరులో రూ. 3 లక్షలతో కలిపి రూ. 73 లక్షలు షేర్,మొత్తం రూ. 1.05 కోట్లు గ్రాస్ వసూలు అయింది.


టోటల్ ఏరియాల కలెక్షన్స్ విషయానికి వస్తే..నైజాంలో రూ. 4.58 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.28 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.81 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.07 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 71 లక్షలు, గుంటూరులో రూ. 81 లక్షలు, కృష్ణాలో రూ. 95 లక్షలు ఇంకా నెల్లూరులో రూ. 45 లక్షలతో కలిపి మొత్తం రూ. 11.66కోట్లు షేర్ ఇంకా రూ. 21.15 కోట్లు గ్రాస్ వసూలైంది.8 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ. 11.66 కోట్లు షేర్ రాబట్టిన 'సీతా రామం' మూవీ ప్రపంచ వ్యాప్తంగా కూడా సత్తా చాటింది. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.25 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 4.35 కోట్లు ఇంకా మిగితా భాషల్లో రూ. 4.35 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపి 8 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు మొత్తం రూ. 20.51 కోట్లు షేర్‌తో పాటు రూ. 40.35 కోట్లు గ్రాస్‌ను కలెక్ట్ చేసింది.ఈ సినిమాతో దుల్కర్ సల్మాన్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. అందులోనూ స్ట్రెయిట్ తెలుగు మూవీ కావడంతో చాలా ఆనందంగా వున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: