టాలీవుడ్ సీనియర్ స్టార్ రచయితలలో ఒకరైన పరుచూరి గోపాల కృష్ణ… గత కొంత కాలంగా 'పరుచూరి పలుకులు' పేరుతో థియేటర్లలో ఆడి వెళ్లిపోయిన సినిమాల పై తన అభిప్రాయాన్ని తెలియజేస్తున్న విషయం తెలిసిందే.


తాజాగా ఆయన 'ఎఫ్‌3′ సినిమా గురించి తన అభిప్రాయాన్ని తెలియజేశాడు.' 'ఎఫ్‌2' సినిమాలో సోల్‌ ఉంది. 'ఎఫ్‌3'లో లో సోల్ లేదు. ఇందులో జనాలను బఫూన్లను చేసే కామెడీ బాగా ఎక్కువగా ఉంది. ఈ సినిమా నిలబడదు అని కె.రాఘవేంద్ర రావు గారు నాకు ఫోన్ చేసి చెప్పాడు.


గూగుల్ లో ఏవేవో లెక్కలు చూపిస్తున్నారు కానీ అవి నిజమో కాదో తెలీదు. అసలు ఇలాంటి కథను వెంకటేష్ ఎలా ఓకే చేశాడో అర్థం కాదు. ఎవరైనా కథ చెబుతున్నప్పుడు తనకు స్టుపిడిటీ అనిపిస్తే ఆ కథని వెంకటేష్ ఓకే చేయడు. అలాంటిది ఈ సినిమాలో అతను… మురళీశర్మ తన కొడుకు 20 ఏళ్ల క్రితం తప్పిపోయాడు అంటే.. అతను 20 ఏళ్ళ కొడుకులా వచ్చి నాటకాలు ఆడతాడు. అది ఎంత స్టుపిడిటీ అండి.


 


రైలు పట్టాలు తప్పితే ఎలా ఉంటుందో.. 'ఎఫ్3' కథ అలా ఉంటుంది.సునీల్ కడుపులో కత్తి దిగితే నెక్స్ట్ సాంగ్లో వచ్చి డాన్స్ చేయడం ఏంటో, తమన్నా మగవాడిలా వచ్చి నాటకం ఆడడం ఏంటో అస్సలు అర్థం కాదు. అయినా సరే 'ఎఫ్3' సినిమా బ్రతికింది. చివరి 20 నిమిషాలు 'ఎఫ్3′ కి ఆయువు పట్టు' అంటూ పరుచూరి గోపాల కృష్ణ చెప్పుకొచ్చారు.


 


'ఎఫ్3' లో లాజిక్స్ కు అందని కామెడీ ఉంటుంది అన్నది వాస్తవం. కానీ స్క్రీన్ ప్లే అంత వరస్ట్ గా అయితే ఉండదు. 'ఆచార్య' చిత్రం గురించి పరుచూరి చెప్పినప్పుడు.. చాలా పాజిటివ్ వే లో చెప్పి.. చివర్లో సినిమాకి కలెక్షన్లు వచ్చేసి ఉండొచ్చు అంటూ చెప్పారు. చిరు సినిమాపై అంత పాజిటివ్ గా చెప్పిన పరుచూరి.. పక్క హీరోల సినిమాల పై ఇలా చెప్పడం ఏంటో  అస్సలు అర్థం కాదు.మరింత సమాచారం తెలుసుకోండి: