తొలి దశలో సేకరించిన భూములను సరిగా అభివృద్ధి చేయకుండా ఇప్పుడు కొత్తగా భూములు సేకరించడం పిచ్చి పని అని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు జాతీయ మీడియాతో మాట్లాడుతూ చేశారు. రాజధాని ప్రాజెక్టు వెనుక వ్యక్తిగత లాభాలు ఉన్నాయని ఆరోపణలు బలపడుతున్నాయి.గతంలో కూడా అమరావతి భూముల సేకరణలో బినామీ లావాదేవీలు జరిగాయని జగన్ ప్రభుత్వం ఆరోపించింది. అప్పట్లో సీఐడీ దర్యాప్తు జరిగి భారీ మోసాలు బయటపడ్డాయని తెలుస్తోంది.
మాజీ మంత్రులు, టీడీపీ నేతలు బినామీల ద్వారా భూములు కొనుగోలు చేశారని ఆరోపణలు వచ్చాయి. రాజధాని ప్రకటనకు ముందే భూములు కొని విలువలు పెంచుకున్నారని ఆయన వాదించారు. ఇప్పుడు మళ్లీ రెండో దశలో భూముల సేకరణ జరుగుతుండటం వెనుక అదే ఉద్దేశ్యం ఉందని జగన్ స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుంటే ఇటువంటి చర్యలు రాష్ట్రానికి హాని చేస్తాయని హెచ్చరించారు. రైతుల భూములు తీసుకుని హామీలు ఇవ్వకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన గుర్తుచేశారు.
అమరావతి ప్రాజెక్టు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై భారీ ఒత్తిడి తెస్తుందని జగన్ పదేపదే చెబుతున్నారు. తొలి దశలో 50 వేల ఎకరాలకు ఒక లక్ష కోట్ల రూపాయలు అవసరమని చెప్పిన చంద్రబాబు ఆ డబ్బు ఎక్కడి నుంచి తెస్తారో తెలియదని ఆయన వ్యంగ్యం విసిరారు. ఇప్పుడు మరో 50 వేల ఎకరాలు సేకరిస్తే మొత్తం రెండు లక్షల కోట్లు ఖర్చు అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
9490520108.. ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ నియోజకవర్గాల్లో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి. రెండు రాష్ట్రాల్లో నియోజకవర్గాల వారీగా సమస్యలు, ఎమ్మెల్యేల పనితీరు, వారు ఇచ్చిన హామీలు, ప్రజల ఇబ్బందులు, అక్కడ అధికార, ప్రతిపక్ష పార్టీల పరిస్థితులు, రాజకీయ అంశాలపై కూడా మీ అభిప్రాయం మాతో పంచుకోండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి