టాలీవుడ్ డైరెక్టర్ మారుతి, పాన్ ఇండియా హీరో ప్రభాస్ కాంబినేషన్లో భారీ అంచనాల (జనవరి 9)మధ్య విడుదలైన చిత్రం ది రాజా సాబ్. ఇప్పటికే ఓవర్ సిస్ తో పాటుగా రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రీమియర్ షోలు పడ్డాయి. ఇప్పటికీ థియేటర్ల వద్ద ప్రభాస్ అభిమానులు చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు.. ఏకంగా ఒక థియేటర్లోకి ప్లాస్టిక్ మొసళ్లను తీసుకువచ్చి నానా హంగామా చేస్తున్నట్లు ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పెద్ద సైజులో ఉన్న మొసళ్లను తీసుకోవచ్చు థియేటర్లో డాన్సులు వేస్తున్నారు.


అయితే ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్స్ సైతం పలు రకాలుగా కామెంట్స్ చేస్తూ మెంటల్ రెబల్స్ అంటూ వైరల్ గా చేస్తున్నారు. సినిమా విడుదలై ఇప్పటికే పాజిటివ్ టాక్ కూడా తెచ్చుకున్నట్లు కనిపిస్తోంది. ఈ సినిమాలో ఎక్కువగా హర్రర్ ఫ్యాంటసి అంశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు వినిపిస్తున్నాయి. ప్రభాస్ కామెడీ టైమింగ్ కూడా ఈ సినిమాకి బాగుందని ముగ్గురు హీరోయిన్లు ఈ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ అని కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో కొన్ని సీన్స్ బాగున్నాయని మరికొన్ని మైనస్ గా ఉన్నాయని నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


రాజా సాబ్ సినిమా మొదటి 10 నిమిషాలు చాలా ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుందని,ఇక సెకండాఫ్ మొత్తం కూడా కోటలోనే కథ కొనసాగుతోంది ఫస్టాఫ్ తో పోలిస్తే రెండవ భాగం మరింత ఆకట్టుకుందని ప్రభాస్ కామెడీ టైమింగ్ కూడా అభిమానులు ఎంజాయ్ చేసేలా ఉందని, సినిమా చివరి 25 నిమిషాలు హైలెట్ గా ఉందని క్లైమాక్స్ ఎపిసోడ్ సూపర్ గా ఉంది. రొటీన్ గానే కాకుండా చాలా కొత్తగానే ట్రై చేసిన హర్రర్ ఫ్యాంటసి సినిమా అన్నట్టుగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ట్రైలర్లో ఆసక్తి పెంచిన ముసలి గెటప్ ఇందులో కనిపించకపోవడంతో అభిమానులు డిసప్పాయింట్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: