సినిమా బడ్జెట్ విషయంలో నిర్మాతలు ఎక్కడ కూడా వెనుకడుగు వేయలేదు అనడానికి ఇదే నిదర్శనం. కేవలం ఒకే ఒక్క సీన్ కోసం రూ.23 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఈ ఖర్చుతో ఏదైనా ఒక చిన్న సినిమా తీసేయొచ్చు. అయితే ఆ సీన్ ఏదో కాదు ప్రభాస్ మొసలితో పోరాడే సీన్. వాస్తవానికి ఈ సీన్ షూటింగ్ దశలో ఉన్నప్పుడు బడ్జెట్ పరిమితిని దృష్టిలో పెట్టుకొని ఆ సీన్ తొలగించాలని డైరెక్టర్ భావించినప్పటికీ కానీ ప్రభాస్ కు ఈ సీన్ ఐడియా విపరీతంగా నచ్చడంతో కచ్చితంగా అది సినిమాలో ఉండాల్సిందే అని పట్టు పట్టారట.
అంతేకాకుండా ఒకవేళ బడ్జెట్ సమస్యగా మారితే తన రెమ్యూనరేషన్ లో కోత విధించిన పర్వాలేదని ప్రేక్షకులకు మాత్రం ఖచ్చితంగా ఇలాంటి విజువల్ ట్రీట్ అందించాలని ప్రభాస్ కోరడంతోనే అంత బడ్జెట్ పెట్టడం వెనుక నిర్మాతలు వెనుకడుగు వేయలేదు. ట్రైలర్ హైప్ తీసుకురావడానికి కూడా ఈ సీన్ బాగా ఉపయోగపడింది. థియేటర్లో కూడా ఈ సీన్ కి విజిల్స్ వేసినట్టుగా కనిపిస్తోంది ఫ్యాన్స్. ప్రభాస్ కి జోడిగా నిధి అగర్వాల్, రిద్ది కుమార్, మాళవిక మోహన్ నటించగా సంజయ్ దత్, బోయన్ ఇరాని వంటి దిగ్గజ నటులు ఇందులో నటించారు. అలాగే వెన్నెల కిషోర్, బ్రహ్మానందం వంటి వారు కూడా నటించారు. థమన్ అందించిన సంగీతం కూడా అద్భుతంగా ఉంది. మరి మొదటి రోజు ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో చూడాలి మరి రాజాసాబ్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి