యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు చక్కటి గుడ్ న్యూస్. ఆయనతో తాను చేయబోయే సినిమా షూటింగ్ ఎప్పుడూ స్టార్ట్ చేసేదీ చెప్పేశారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్.ఇక వచ్చే వేసవిలో ఎన్టీఆర్ 31చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకు వెళతామని ఆయన తెలిపారు.'సలార్' సినిమా విడుదల కంటే ముందే... ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా 'సలార్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఇక ఈ రోజు ఆ సినిమా విడుదల తేదీ అనౌన్స్ చేశారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ 28 వ తేదీన చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్లు ఆయన తెలిపారు. అయితే... అంత కంటే ముందు ఎన్టీఆర్ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ చేయడానికి ఆయన ప్లాన్ చేస్తున్నారు.ఇక ప్రశాంత్ నీల్ కంటే ముందు కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందనేది ఇంకా క్లారిటీ లేదు. నిజం చెప్పాలంటే... 'ఆర్ఆర్ఆర్' సినిమా కంటే ముందు ఆ సినిమాకు ఎన్టీఆర్ సంతకం చేశారు. ఈపాటికి సినిమా షూటింగ్ ని స్టార్ట్ చేయాలి.


కానీ,అది ఆలస్యం అవుతూ వస్తోంది. ఇది ntr కి 30 వ సినిమా.ఎన్టీఆర్ 30 ఆలస్యం కావడానికి 'ఆచార్య' సినిమా పరాజయమే కారణమని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే... అందులో ఏమాత్రం నిజం లేదని ఇటీవల వెల్లడైన ఓ వార్త వల్ల తెలిసింది. నిజానికి, ఈ నెలలో కొరటాల శివ సినిమాను స్టార్ట్ చేయాలని యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్లాన్ చేశారు. అయితే... కొన్ని రోజులుగా ఆయన భుజం ఇంకా మోకాలి నొప్పితో బాధ పడుతున్నారని, ఇక అందువల్ల ఆయన్ను నాలుగు వారాల పాటు విశ్రాంతి తీసుకోమని వైద్యులు సూచించారని సమాచారం.ప్రస్తుతం ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితికి 'ఆర్ఆర్ఆర్' సినిమా షూటింగ్ సమయంలో అయిన గాయాలే కారణం అని తెలుస్తోంది. అందులో యాక్షన్ సీన్స్ అనేవి చాలా ఉన్నాయి. అవి చేసినప్పుడు ఎన్టీఆర్ కి గాయాలు అయ్యాయట. అందుకని... కొన్ని రోజులు రిస్కీ ఫైట్స్ ఇంకా షూటింగులకు దూరంగా ఉండమని చెప్పారట.

మరింత సమాచారం తెలుసుకోండి: