కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రల్లో నటించిన విజయ్ దేవరకొండ ,  రీతు వర్మ హీరోయిన్ గా తరుణ్ భాస్కర్ దర్శకత్వం లో తెరకెక్కిన తెరకెక్కిన పెళ్లి చూపులు మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లో హీరోగా తన కంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు . ఆ తర్వాత అర్జున్ రెడ్డి , గీత గోవిందం , టాక్సీ వాలా మూవీ లతో విజయ్ దేవరకొండ టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోగా మారి పోయాడు . ఇది ఇలా ఉంటే తాజాగా విజయ్ దేవరకొండ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం లో తెరకెక్కిన లైగర్ మూవీ లో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే . ఈ మూవీ లో అనన్య పాండే హీరోయిన్ గా నటించగా , మైక్ టైసన్మూవీ లో ఒక కీలక పాత్ర లో నటించాడు . రమ్యకృష్ణమూవీ లో విజయ్ దేవరకొండ తల్లి పాత్రలో కనిపించబోతుంది .  

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోగా కొనసాగుతున్న విజయ్ దేవరకొండ  సినిమాల్లోకి నటుడి గా రాక ముందు ఏం చేశాడు అనేది స్వయంగా ఆయనే తాజాగా చెప్పు కొచ్చాడు . సినిమా ఇండస్ట్రీ లో పరిచయాలు పెంచుకునేందుకు తొలుత అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇండస్ట్రీ లోకి విజయ్ దేవరకొండ అడుగు పెట్టాడు. అందులో భాగంగా విజయ్ దేవరకొండ దర్శకుడు తేజ వద్ద అసిస్టెంట్ గా పని చేశాడు. స్వయంగా ఈ విషయాన్ని విజయ్ దేవరకొండ తాజాగా వెల్లడించాడు. ఇది ఇలా ఉంటే విజయ్ దేవరకొండ తాజాగా నటించిన లైగర్ మూవీ ఆగస్ట్ 25 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: