యాంకర్ సుమ.. తెలుగు బుల్లితెరపై టాప్ యాంకర్గా కొనసాగుతోంది. ఎందుకో ఆమె ఏది మాట్లాడినా వినసొంపుగానే ఉంటుంది. వల్గారిటీ కి దూరంగా ఆమె చెప్పే మాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ప్రతి షో లో కూడా స్పాంటేనియస్ పంచ్ లతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూనే ఉంటుంది. ఒకవైపు బుల్లితెరపై కార్యక్రమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంటూనే మరోవైపు అటు సినిమా ఈవెంట్స్ చేస్తూ ఉంది యాంకర్ సుమ. ప్రస్తుతం పెద్ద హీరో సినిమా ఏదైనా విడుదల అవుతుంది అంటే చాలు ఇక ఆ సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలకు హోస్టింగ్ చేసేది యాంకర్ సుమ అనే చెప్పాలి.


 ఆ రెంజ్ లో ప్రస్తుతం గుర్తింపును సంపాదించుకుంది. అయితే ఆ యాంకర్ సుమ రాజీవ్ కనకాలను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక వీరిద్దరూ ప్రస్తుతం ఇండస్ట్రీలో అన్యోన్య దంపతులుగా కొనసాగుతున్నారు. గత కొంతకాలం నుంచి వీరిద్దరూ విడిపోయి వేరుగా ఉంటున్నారు అన్న వార్తలు వచ్చినప్పటికీ ఆ వార్తలు మాత్రం అబద్దం అన్న విషయం తేలింది. అయితే ఇటీవలే యాంకర్ సుమ తమ పెళ్లి చేసి పాపం చేశారు అంటూ ఏకంగా దర్శకుడు రాఘవేంద్ర రావు తో అనడంతో అభిమానులు అందరూ షాక్ అయ్యారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. సుడిగాలి సుదీర్ మెయిన్ రోల్లో నటిస్తున్న వాంటెడ్ పండుగాడు అనే సినిమా రేపు విడుదల కానుంది.


 రాఘవేంద్ర రావు సమర్పణలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.  అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు చిత్రబృందం. ఇక ఇటీవలే రాఘవేంద్ర రావు సహా మరికొంతమంది ఈటీవీ లో సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న క్యాష్ షో లో పాల్గొన్నారు. ఈ సందర్భంలోనే ఇక రాఘవేంద్రరావు తో సుమాతో ఒక సంభాషణ జరుపుతున్న సమయంలో  మీ పెళ్లి చేసింది నేనే కదా అంటూ రాఘవేంద్రరావు గుర్తు చేస్తాడు. అవును సార్ ఆ పాపం మీదే అంటూ చెబుతుంది సుమ.. దీంతో సుమ పెళ్లి చేసి పాపం చేశారు అన్న కామెంట్ చేయడంతో అభిమానులు షాక్ అవుతారు. మరికొంతమంది సరదాగా అలా కామెంట్ చేసి ఉంటుందని లైట్ తీసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: