ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ కొరియోగ్రాఫర్ గా కొనసాగుతున్నాడు జానీ మాస్టర్. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలు అందరికీ కూడా తనదైన శైలిలో డాన్స్ కొరియోగ్రఫీ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు అని చెప్పాలి. ఇటీవలి కాలంలో జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఎన్నో పాటలు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తు ప్రేక్షకులందరినీ తెగ ఆకట్టుకుంటున్నాయి. ఇకపోతే డాన్స్ మాస్టర్స్ అందరూ ఒకలా డాన్స్ చేస్తుంటే ఎందుకో జానీ మాస్టర్ మాత్రం ఎప్పుడు విభిన్నమైన రీతిలో అదిరిపోయే స్టెప్పులు తో ఆకట్టుకుంటూ ఉంటాడు.


 ఇకపోతే ఒకప్పుడు ఈటీవీ లో ప్రసారమయ్యే ఢీ షో లో కంటెస్టెంట్ గా చేసిన జానీ మాస్టర్.. ఇక ఇప్పుడు అదే షోలో జడ్జి గా వ్యవహరిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. అయితే సాధారణంగా జానీ మాస్టర్ కు ఢీ షో లో కంటెస్టెంట్ లు చేసిన పర్ఫామెన్స్ లో అంత త్వరగా నచ్చవు. ఒకవేళ నచ్చితే మాత్రం ఇక వారిని ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటాడు. ఇకపోతే ఇటీవల విడుదలైన ఢీ షో ప్రోమో లో భాగంగా జానీ మాస్టర్ ఒక పర్ఫామెన్స్ కి ఫిదా అయిపోయాడు. ఇంతలి జానీ మాస్టర్ ఫిదా చేసిన ఆ పాట ఏదో తెలుసా.. కమ్మనీ ఈ ప్రేమలేఖలే అనే ఒక మెలోడీ సాంగ్. అదేంటి మెలోడీ సాంగ్ లో పెద్దగా డాన్స్ ఉండదు కదా మరి జానీ మాస్టర్ ఎలా ఫిదా అయ్యారు అని అనుకుంటున్నారు కదా.. డాన్స్ పెద్దగా లేకపోయినప్పటికీ ఈ పాట పై తీసుకున్న కాన్సెప్ట్ మాత్రం కేవలం జానీ మాస్టర్ ను మాత్రమే కాదు అందరిని  ఫిదా చేసింది. ఇక ప్రతి ఒక్కరి పర్ఫామెన్స్ అదిరిపోయింది అనే చెప్పాలి.. పర్ఫామెన్స్ పూర్తయిన తర్వాత తనదైన శైలిలోనే మెడ పై చేయి పట్టుకొని అభినందించిన జానీ మాస్టర్ ఏకంగా తన జాకెట్ విప్పి మరీ కొరియో గ్రాఫర్ ని పిలిచి హగ్ చేసుకొని అభినందించి ఆ జాకెట్ అతనికి ఇచ్చాడు. జానీ మాస్టర్ అభినందనలతో కొరియోగ్రాఫర్ సంతోషంలో మునిగిపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: