శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ సౌత్ లో సినిమాలు చేయకపోయినా ఆమెకు ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే విషయం తెలిసిందే. సినిమాసినిమాకు జాన్వీ కపూర్ కు ప్రేక్షకులలో క్రేజ్ పెరుగుతోంది.


సౌత్ లో సినిమాలు చేయాలని జాన్వీ కపూర్ భావిస్తున్నా వేర్వేరు కారణాల వల్ల ఆమె ఇక్కడ నటించడం లేదట.. పలువురు తెలుగు హీరోలతో తనకు నటించాలని ఉందని జాన్వీ కపూర్ ఇప్పటికే పలు సందర్భాల్లో వెల్లడించిన విషయం తెలిసిందే.


తాజాగా జాన్వీ కపూర్ డేటింగ్ గురించి మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు. తన తల్లి శ్రీదేవికి తండ్రి బోనీ కపూర్ కు డేటింగ్ కాన్సెప్ట్ అస్సలు నచ్చదని ఆమె చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తాను సింగిల్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నానని ఆమె కామెంట్లు చేశారు. నచ్చినవాడిని తీసుకొస్తే పెళ్లి చేస్తామని నా కుటుంబ సభ్యులు చెప్పారని జాన్వీ కపూర్ పెళ్లి గురించి వెల్లడించారట.. డేటింగ్ అనేది ఒక సందర్భం మాత్రమేనని ఆమె అన్నారని తెలుస్తుంది..


 


డేటింగ్ అనేది ఎందుకో నాకు తెలియదని ఆమె తెలిపారు. మనసుకు నచ్చిన ప్రతి అబ్బాయిని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం అయితే లేదని ఆమె చెప్పుకొచ్చారు. మనం చాలా ప్రశాంతంగా ఉంటామని మనం ఎప్పుడూ చిల్ అవుతూ ఉండాలని ఆమె కామెంట్లు కూడా చేశారు. లైఫ్ లో లైక్ చిల్ అనే కాన్సెప్ట్ ఉండాలని దీనిని ఎవరూ అర్థం చేసుకోలేరని జాన్వీ కపూర్ వెల్లడించడం గమనార్హం.


 


ఎవరితోనైనా నిజమైన బంధాన్ని ఏర్పరచుకోవాలంటే వారికి దూరంగానే ఉండాలని ఆమె తెలిపారు. తాను ఒంటరిగా ఉండటం వల్ల హ్యాపీగా లైఫ్ సాగిస్తున్నానని జాన్వీ కపూర్ అన్నారట. ఇతరులతో సాన్నిహిత్యంగా ఉండటం వల్ల వారు దానికి కట్టుబడి ఉండాల్సి వస్తుందని జాన్వీ కపూర్ చెప్పుకొచ్చారు. దీంతో వాళ్లు భయపడుతుంటారని బెదిరింపులకు గురవుతూ ఉంటారని కూడా ఆమె తెలిపారు. జాన్వీ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: