తలపతి విజయ్ ఇప్పటికే ఈ సంవత్సరం బీస్ట్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. భారీ అంచనాల నడుమ తమిళ , తెలుగు ,  కన్నడ , హిందీ ,  మలయాళ భాషల్లో భారీ ఎత్తున విడుదల అయిన ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకో లేక పోయింది. దానితో చివరగా ఈ మూవీ బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇలా బీస్ట్ మూవీ తో తన అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులను కూడా నిరుత్సాహపరిచిన తలపతి విజయ్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వరుస (వారసుడు) మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. రష్మిక మందన ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తుండగా , దిల్ రాజు ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ తమిళ , తెలుగు భాషల్లో విడుదల కాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది.

ఇది ఇలా ఉంటే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే తలపతి విజయ్ తమిళ క్రేజీ దర్శకుడు అయి నటు వంటి లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో నటించబోతున్న విషయం మనకు తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది. ఈ మూవీ లో తలపతి విజయ్ సరసన  త్రిష మరియు కీర్తి సురేష్ హీరోయిన్ లుగా నటించబోతున్నట్లు  ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి. ఇది వరకే తలపతి విజయ్ , లోకేష్ కనకరాజు కాంబినేషన్ లో తెరకెక్కిన మాస్టర్ మూవీ మంచి విజయం సాధించడంతో వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న రెండో మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: