అల్లు అర్జున్ నటించిన చిత్రం పుష్ప.. ఈ చిత్రం పార్ట్ 2 తాజాగా పూజా కార్యక్రమాలు కూడా ఇటీవల పూర్తి చేసుకున్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది ఫిబ్రవరి నెలలోనే ప్రారంభం కావాల్సి ఉండగా కథపరంగా కాస్త మార్పులు చేర్పులు చేసి మరింత బలంగా ఈ సినిమాలోని పాత్రలను డైరెక్టర్ సుకుమార్ మరింత తీర్చిదిద్దడానికి కాస్త సమయం పట్టిందని చెప్పవచ్చు. పుష్ప -2 లోని ప్రతిపాత్రను కూడా అభిమానులు అంతకుమించి ఉండేలా ఉన్నట్లు ఊహించుకోవడం జరుగుతోంది ఇక పుష్ప రాజ్ ను మొదటి పార్ట్ లో ఒక సామాన్య కూలీ గా చూపించిన డైరెక్టర్ సుకుమార్ రెండవ పార్ట్ ని ఎలా చూపించబోతున్నారు అనే విషయంపై అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


ఇక ఇందులో సునీల్ , అనసూయ పాత్ర విషయంలో కూడా ఇది ఆసక్తి నెలకొంది. ఈ సమయంలో రష్మిక పాత్ర పై మరింత అంచనాలు పెంచే విధంగా కనిపించబోతోంది అంటూ ఆమె అభిమానుల సైతం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక రష్మిక శ్రీవల్లి పాత్రలో పుష్ప సినిమాలో బాగా అదరగొట్టింది ఇక పార్ట్ 2 లో పుష్పరాజ్ భార్యగా కనిపించబోతోంది శ్రీవల్లి. ఇక ఆమె పాత్ర సాదాసీదిగా ఉంటే కచ్చితంగా ఆమెను అభిమానులు ఒప్పుకోరు అని చెప్పవచ్చు అందుకే డైరెక్టర్ సుకుమార్ ఆమె పాత్రను కథలో భాగస్వామ్యం చేసి మరింత పవర్ఫుల్ గా చూపించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం.


ఇక తాజాగా ఈ సినిమా పూజ కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు.. పుష్ప మళ్లీ రాబోతున్నాడు అంటూ రష్మిక సోషల్ మీడియా ద్వారా పలు ఆసక్తికరమైన ఫోటోలను షేర్ చేసింది ఈ ఫోటోలపై ఒక అభిమాని స్పందిస్తూ.. ఈ చిత్రంలో రష్మిక పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉండాలి అలాగే ధనంజయ్ పాత్ర ఎలా ఉంటుందో అంటూ ఆసక్తిగా ఉన్నామంటూ తెలియజేశారు. అతని కామెంట్లకు రష్మిక స్పందిస్తూ శ్రీవల్లి పాత్ర ఈసారి అంతకుమించి ఉండేలా ఉంటుందని ఆశిద్దాం అని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: