సినీ ఇండస్ట్రీకి చిన్న వయసులోని ఎంట్రీ ఇచ్చిన వారిలో కృతి శెట్టి కూడ ఒకరిని చెప్పవచ్చు.. అలా మొదట ఉప్పెన సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది ఆ తర్వాత తన దగ్గరకు వచ్చిన పలు ఆఫర్లను సైతం ఓకే చెబుతూ హ్యాట్రిక్ విజయాలను సైతం అందుకుంది. అయితే మొదట మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ఒప్పుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తన దగ్గరకు వచ్చిన ఎలాంటి పాత్రనైనా ఓకే చేయడంతో కాస్త నిరుత్సాహపరిచేలా చేశాయని చెప్పవచ్చు. దాదాపుగా కోటి రూపాయల నుంచి రూ.1.5 కోట్ల వరకు రెమ్యూనరేషన్ పెంచేసింది. అయితే ఈ అమ్మడికి అనుకోకుండా ది వారియర్, మాచర్ల నియోజకవర్గం ఇలాంటి సినిమాలు డిజాస్టర్ గా మిగిలాయి. ఇక ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమా మిక్స్డ్ టాక్ తో ఉండడంతో ఈమె పైన సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తూ ఉన్నట్లుగా తెలుస్తోంది.



మొన్నటి వరకు ఉప్పెన సినిమాకు సంబంధించి పలు పోస్టర్లతో సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో క్రేజీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఒక్కసారిగా క్లాసులు అందుకోవటంతో ట్రోలింగ్ బారిన పడటం జరుగుతోంది. ఇక కొంతమంది ఈమెను ఐరన్ లెగ్ అని కూడా కామెంట్లు చేస్తూ ఉన్నారు. సాధారణంగా సినిమాలు విజయం అందుకుంటే చాలు పొగడ్తలతో ముంచేస్తూ ఉంటారు.ఒకవేళ ఫ్లాప్ అయ్యిందంటే చాలు ఇలా ట్రోల్స్ చేయడం సర్వసాధారణంగా మారుతోంది.


అయితే ఇలాంటి నెగటివ్ ట్రోలింగ్, కామెంట్స్ మాత్రం ఎవరికి ఉపయోగపడవు అని కేవలం టాలెంట్ ఉంటే మళ్ళీ స్టార్స్ అయ్యే అవకాశం కూడా ఉందని మరి కొంతమంది ఇలా పాజిటివ్గా కూడా స్పందిస్తూ ఉన్నారు. ఇక ఆమె అభిమానులు మాత్రం ఈమె రాబోయే సినిమాలలో ఆచితూచి అడుగులు వేసి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నారు. ఇక రెమ్యూనరేషన్ విషయంలో కూడా కాస్త తగ్గినట్లుగా కూడా తెలుస్తోంది ఈ ముద్దుగుమ్మ.

మరింత సమాచారం తెలుసుకోండి: