టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయినటు వంటి విజయ్ దేవరకొండ ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఖుషి అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో విజయ్ దేవరకొండ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి ఇప్పటికే చాలా రోజులు అవుతుంది. ఈ మూవీ ని ఈ సంవత్సరం డిసెంబర్ 23 వ తేదీన విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ ఇప్పటికీ అధికారికంగా ప్రకటించింది.

విజయ్ దేవరకొండ , సమంత ఇది వరకు మహానటి మూవీవ్లో కలిసి నటించారు. వీరిద్దరి కాంబినేషన్ లో ఇది రెండవ సినిమా. ఇది ఇలా ఉంటే ఖుషి మూవీ కి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఖుషి మూవీ లో సెకండ్ హాఫ్ లో ఒక ముఖ్యమైన పాత్ర ఉండనున్నట్లు , ఆ ముఖ్యమైన పాత్ర కోసం మూవీ యూనిట్ రాశి ఖన్నా తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ వార్త కనుక నిజం అయితే విజయ్ దేవరకొండ ,  రాశి కన్నా మరో సారి కలిసి నటించ బోతున్నట్లు అవుతుంది. ఇది వరకే విజయ్ దేవరకొండ , రాశి కన్నా కాంబినేషన్ లో వరల్డ్ ఫేమస్ లవర్ అని మూవీ తెరకెక్కింది.

కొంత కాలం క్రితం విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా మెప్పించ లేక పోయింది. ఇది ఇలా ఉంటే తాజాగా విజయ్ దేవరకొండ 'లైగర్' అనే బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ ఆగస్టు 25 వ తేదీన థియేటర్ లలో విడుదల అయ్యింది. ఈ మూవీ కి డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: