నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రముఖ 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లలో ఒకటి అయినటు వంటి ఆహా  'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో ఆన్ స్టాపబుల్ అనే టాక్ షో కి హోస్ట్ గా వ్యవహరించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ టాక్ షో లో బాలకృష్ణ ఎంతో మంది గెస్ట్ లతో ముచ్చటించిన విషయం మనకు తెలిసిందే. ఈ టాక్ షో కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. దానితో ఈ టాక్ షో అద్భుతమైన విజయాన్ని సాధించింది.

ఇలా ఈ టాక్ షో మొదటి సీజన్ మంచి విజయం సాధించడంతో ఆహా నిర్వాహక బృందం ఈ టాక్ షో కు రెండవ సీజన్ ని కూడా ప్లాన్ చేసింది. అందులో భాగంగా ఇప్పటికే అం5 స్టాపబుల్ సెకండ్ సీజన్ కు సంబంధించిన అధికారిక ప్రకటన ను కూడా ఆహా నిర్వాహ బృందం అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఆన్ స్థాపబుల్ సెకండ్ సీజన్ కి ఫస్ట్ గెస్ట్ గా ఆ స్టార్ హీరో రాబోతున్నాడు ...  ఈ స్టార్ హీరో రాబోతున్నాడు అంటూ ఇప్పటికే చాలా మంది పేర్లు తెరపైకి వచ్చాయి.

కాక పోతే ఆహా నిర్వాహ బృందం మాత్రం ఇప్పటి వరకు ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేయలేదు. ఇది ఇలా ఉంటే తాజాగా అన్ స్టాపబుల్ సీజన్ 2 మొదటి ఎపిసోడ్ కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ టాక్ షో సెకండ్ సీజన్ లో మొదటి ఎపిసోడ్ ని దసరా పండుగ సందర్భంగా ప్రసారం చేయనున్నట్లు , లేకపోతే అక్టోబర్ రెండవ వారంలో ఈ షో మొదటి ఎపిసోడ్ ని ప్రసారం చేసే అవకాశం ఉన్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: