ప్రతి సంవత్సరం తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంతో మంది హీరోయిన్ లు ఎంట్రీ ఇస్తూ ఉంటారు.  అలాగే ఈ సంవత్సరం కూడా కొంత మంది హీరోయిన్ లు తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చారు . అలా ఈ సంవత్సరం తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఇచ్చిన ముద్దు గుమ్మ లలో సంజన ఆనంద్ ఒకరు . ఈ ముద్దు గుమ్మ తాజా గా కిరణ్ అబ్బవరం హీరోగా శ్రీధర్ గాడే దర్శకత్వంలో తెరకెక్కిన నేను మీకు బాగా కావాల్సిన వాడిని మూవీ లో కిరణ్ అబ్బవరం సరసన హీరోయిన్ గా నటించింది .

మూవీ సెప్టెంబర్ 16 వ తేదీన థియేటర్ లలో విడుదల అయ్యింది. ప్రస్తుతం ఈ సినిమా ధియేటర్ లలో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. ఇది ఇలా ఉంటే సంజన ఆనంద్ ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న సంజన ఆనంద్ తనకు సంబంధించిన అనేక ఆసక్తికరమైన విషయాలను చెప్పు కొచ్చింది.

తాజాగా సంజన ఆనంద్ ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ... నేను పుట్టి పెరిగింది బెంగళూర్ లో ,  నా మాతృభాష కన్నడ. నేను ఇంజనీరింగ్ ని పూర్తి చేశాను.  రెండు సంవత్సరాల పాటు సాఫ్ట్ వెర్ ఇంజనీర్ గా పని కూడా చేశాను అని సంజన ఆనంద్ చెప్పు కొచ్చింది. మూవీ లు అంటే నాకు మొదటి నుండి చాలా ఇష్టం. నా స్నేహితులు కూడా నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేశారు. మంచి ఉద్యోగం వదులుకుని వెళ్లడం అందికని మా  పేరెంట్స్ అన్నారు. కానీ ఇక్కడ ఎంతో కొంత సాధించాలనే పట్టుదలతోనే వచ్చాను అని సంజన ఆనంద్ తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పు కొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: