తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. కమలహాసన్ కూతురుగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె ప్రస్తుతం స్టార్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతోంది. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నది. ఇక రవితేజ నటించిన క్రాక్ చిత్రంతో మొదలుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తోంది. ప్రస్తుతం శృతిహాసన్ ప్రభాస్ తో కలిసి సలార్ సినిమాలో కూడా నటిస్తున్నది. అలాగే చిరంజీవి , బాలకృష్ణ వంటి హీరోలతో కూడా నటిస్తున్నది ఈ ముద్దుగుమ్మ. ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ మరొకవైపు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గానే ఉంటుంది శృతిహాసన్.


అయితే గత కొద్ది రోజులుగా తన ప్రియుడు శాంతను హజారికాకు ఫొటోస్ , వీడియోస్ షేర్ చేయడం జరిగింది తాజాగా ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఢిల్లీకి చెందిన చిత్రకారుడు శాంతాను హజారికాతో శృతిహాసన్ రిలేషన్ షిప్ లో ఉన్న విషయం అందరికీ తెలిసినదే. అయితే తను మాత్రం తన బెస్ట్ ఫ్రెండ్ అని చాలా ప్రత్యేకమైన వ్యక్తి అని కూడా గతంలో ఎన్నో ఇంటర్వ్యూలలో తెలియజేసింది ఈ ముద్దుగుమ్మ. అయితే సోషల్ మీడియా అనేది తన జీవితంలో అభిమానులకు చాలా దగ్గర చేయడానికి ఒక గొప్ప మార్గమని తెలియజేసింది శృతిహాసన్.ప్రస్తుతం ప్రభాస్ తో కలిసి నటిస్తున్న సలార్ సినిమా షూటింగ్ కోసం హైదరాబాదుకి వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే డైరెక్టర్ బాబి దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న 154వ సినిమా లో కూడా నటిస్తున్నది. ఇక డైరెక్టర్ గోపీచంద్ మలినేని, బాలకృష్ణ కాంబినేషన్లో రాబోతున్న 107 వ సినిమాలో కూడా నటిస్తున్నది. ప్రస్తుతం శృతిహాసన్ షేర్ చేసిన ఈ వీడియోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. శృతిహాసన్ వివాహం కోసం ఆమె అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: