తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి నటుడి గా గుర్తింపు తెచ్చుకున్న వారిలో శ్రీ విష్ణు ఒకరు. శ్రీ విష్ణు హిట్ , ప్లాప్ లతో ఏ మాత్రం సంబంధం లేకుండా వైవిధ్యమైన మూవీ లలో హీరోగా నటిస్తూ తన కెరియర్ ని ముందుకు సాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే శ్రీ విష్ణు గత కొంత కాలంగా నటించిన మూవీ లు బాక్సా ఫీస్ దగ్గర చెప్పు కోదగ్గ విజయాలను సాధించ లేదు . ఇది ఇలా ఉంటే తాజాగా శ్రీ విష్ణు 'అల్లూరి' అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే.

మూవీ లో శ్రీ విష్ణు పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. ప్రదీప్ వర్మ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో అల్లూరి మూవీ పై సినీ ప్రేమికులు పర్వాలేదు అనే రేంజ్ లో అంచనాలు పెట్టుకున్నారు. అలా పరవాలేదు అనే రేంజ్ అంచనాల నడుమ అల్లూరి మూవీ సెప్టెంబర్ 23 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది.

ప్రస్తుతం ఈ మూవీ విజయ వంతంగా థియేటర్ లలో ప్రదర్శించ బడుతుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ 'ఓ టి టి' హక్కులకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆల్లూరి మూవీ 'ఓ టి టి' హక్కులను ప్రముఖ 'ఓ టి టి' సంస్థలలో ఒకటి అయినటువంటి ఆహా దక్కించుకున్నట్లు , థియేటర్ రన్ కొన్ని వారాలు ముగిసిన తర్వాత ఈ మూవీ ని ఆహా 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: