టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున తాజాగా ది ఘోస్ట్ అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో నాగార్జున సరసన సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటించగా చందమామ కథలు , గుంటూర్ టాకీస్ ,  గరుడ వేగ మూవీ లతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ను తెచ్చుకున్న యువ దర్శకుడు ప్రవీణ్ సత్తార్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో నాగార్జున మరియు సోనాల్ చౌహన్ ఇంటర్ ఫూల్ ఆఫీసర్ లుగా కనిపించ బోతున్నారు.

ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. అక్టోబర్ 5 వ తేదీన ఈ మూవీ ని విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గరపడడంతో ఇప్పటికే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా రన్ టైమ్ ని కూడా లాక్ చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ది ఘోస్ట్ మూవీ 2 గంటల 15 నిమిషాల నిడివి తో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.

ఇది ఇలా ఉంటే ఇప్పటికే నాగార్జున ఈ సంవత్సరం బంగార్రాజు , బ్రహ్మాస్త్రం అనే మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. ఇందులో బంగార్రాజు మూవీ ఈ సంవత్సరం ప్రారంభంలో సంక్రాంతి కానుకగా విడుదల అయ్యి బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. బ్రహ్మాస్త్రం అనే హిందీ మూవీ లో నాగార్జున ఒక కీలక పాత్రలో నటించాడు. ఇది ఇలా ఉంటే ది ఘోస్ట్ మూవీ తో నాగార్జున ఏ రేంజ్ విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర సొంతం చేసుకుంటాడో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: