గత కొన్ని రోజుల క్రితం సినీ ఇండస్ట్రీలో విడాకుల విషయం సంచలనం సృష్టిస్తున్న విషయం  మనందరికీ తెలిసిందే. ఇక పోతే టాలీవుడ్ లో సమంత - నాగచైతన్య విడాకులు తీసుకున్న తర్వాత కోలీవుడ్ స్టార్ కపుల్ ఐశ్వర్య రజినీకాంత్, ధనుష్ విడాకులు తీసుకుంటున్నామని ప్రకటించారు.ఇక ఈ విషయాన్ని స్వయంగా  ఐశ్వర్య రజినీకాంత్, ధనుష్  తన సోషల్ మీడియా ద్వారా తెలియజేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ కూడా ఏవో మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకుంటున్నామని అధికారికంగా ప్రకటించడం జరిగింది.

 ఇక ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, అభిమానులు అందరూ కూడా ఎంతో బాధపడ్డారు. కాగా సోషల్ మీడియా కలిపే ప్రయత్నం చేశారు.ఇదిలావుంటే ఇక రజినీకాంత్ కూడా తీవ్రంగా మానసికక్షోభను అనుభవించారు.అయితే జ్తే  నిజానికి వీరు భార్యాభర్తలుగా విడిపోయి.. స్నేహితులగా కలిసి ఉంటాం అంటూ అఫీషియల్ గానే ప్రకటించారు. ఇకపోతే  తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..  కోలీవుడ్ స్టార్ కపుల్ ఐశ్వర్య రజినీకాంత్, ధనుష్  జంట అయితే విడాకులు రద్దు చేసుకున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.అంతేకాదు  ముఖ్యంగా తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇటీవల కౌన్సిలింగ్ తీసుకున్న వీరిద్దరూ పిల్లల కోసం

 తమ విడాకులు నిర్ణయాన్ని రద్దు చేసుకుంటున్నట్లు కోలీవుడ్ మీడియాలో కథలుగా వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఈ వార్త విని అటు కుటుంబ సభ్యులు ఇటు సినీ అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.అయితే ఈ జంట లాగే టాలీవుడ్ బెస్ట్ కపుల్ సమంతనాగచైతన్య కూడా విడాకులను రద్దు చేసుకోవాలని తమ ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం. కాగా ఐశ్వర్యధనుష్ త్వరలోనే విడాకులు రద్దు చేసుకుంటున్నాము అని అఫీషియల్ ప్రకటన కూడా ఇవ్వనున్నారు. అయితే ఏదేమైనా ఈ జంట తిరిగి అర్థం చేసుకొని పిల్లల కోసం అయినా కలవడం అందరిని ఆనందానికి గురిచేస్తుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: