దృశ్యం సినిమాకి రాక్ స్టార్ మ్యూజిక్.. ఇక వాయింపుడే?

దృశ్యం ...మలయాళ డైరెక్టర్ జీతూ జోసెఫ్ తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు 'దృశ్యం', 'దృశ్యం-2' ఎలాంటి విజయాన్ని అందుకున్నాయో అందరికీ కూడా తెలిసిందే.ఇక ఈ సినిమాలను ఇప్పటికే ఇతర భాషల్లో కూడా రీమేక్ చేసి, అక్కడ కూడా హిట్లు అందుకున్నారు. కాగా, తెలుగులో ఈ రెండు సినిమాల్లో కూడా విక్టరీ వెంకటేష్ హీరోగా నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ఇక హిందీలో హీరో అజయ్ దేవ్గన్ తొలిభాగం 'దృశ్యం' సినిమాలో నటించి మంచి విజయాన్ని అందుకున్నాడు.ఇప్పుడు బాలీవుడ్‌లో దృశ్యం-2 సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇందులో కూడా తొలిభాగం దృశ్యం సినిమాలో నటించిన మెజారిటీ నటీనటులు నటిస్తున్నారు. కాగా, ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ అప్డేట్ ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చక్కర్లు కొడుతోంది. బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న దృశ్యం-2 సినిమాకు టాలీవుడ్ రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. 


ఇప్పటికే తనదైన మ్యూజిక్‌తో దక్షిణాదిన టాప్ స్థానాన్ని సొంతం చేసుకున్న దేవిశ్రీ ప్రసాద్ ఇప్పుడు ఓ బాలీవుడ్ మూవీకి ఫుల్ ఫ్లెడ్జ్‌గా సంగీతం అందిస్తుండటంతో, దృశ్యం-2 సినిమాకి ఆయన ఇచ్చే మ్యూజిక్ ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.ఇటీవల పుష్ప సినిమా పాటలతో ఇండియాని షేక్ చేశాడు దేవి శ్రీ ప్రసాద్. ఇక నార్త్ ఆడియన్స్ అయితే పుష్ప పాటలకు ఫుల్ ఫిదా అయ్యారు.ఇక హిందీ దృశ్యం-2 చిత్రాన్ని అభిషేక్ పాఠక్ తెరకెక్కిస్తుండగా, శ్రియా సరన్, టబూ, అక్షయ్ ఖన్నా తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. పనోరమ స్టూడియోస్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాను నవంబర్ 18 వ తేదీన రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.మరి బాలీవుడ్ దృశ్యం 2 కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఏ విధంగా అదిరిపోయే సంగీతం ఇస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: