ప్రభాస్ ఇప్పుడు చేస్తున్న సినిమాలలో భారీ మాస్ మసాలా సినిమాగా రూపొందుతుంది సలార్. పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన తరువాత ప్రభాస్ పాన్ ఇండియా భారీ బడ్జెట్ సినిమాలనే చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమా పై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. కేజీఎఫ్ సినిమా తో మంచి విజయాన్ని అందుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతు ఉండడంతో ఈ సినిమా పై ఇంతటి అంచనాలు నెలకొన్నాయి. అలా వీరిద్దరి క్రేజీ కాంబోలో వస్తున్న మూవీ 'స‌లార్' కు కొన్ని ఇబ్బందులు తలెత్తు తున్నాయి.

ఎన్నో కోట్లతో  భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఈ సినిమాకు లీకుల బెడద పట్టుకుంది. ఈ మధ్య ప్రతి సినిమాకు ఇలాంటి ఇబ్బంది కలుగుతుంది. కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్న ఈ సినిమా లకు ఇలాంటి ఇబ్బందులు రావడం నిజంగా ఎంతో బాధాకరం. అలా ఇటీవల ప్రభాస్‌ షూటింగ్‌లో పాల్గొన్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇది మాత్రమే కాదు అంతకుముందు కూడా కొన్ని పిక్స్, వీడియోలు బయటకు వచ్చాయి.ఎంత కట్టి చేసినా కూడా దీన్ని మాత్రం ఎవరు ఆపలేకపోతున్నారు. ఇది సినిమా పై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి. ఈ సినిమాలో ప్రభాస్ సరసన చెన్నై బ్యూటీ శ్రుతి హాసన్ హీరోయిన్‌గా యాక్ట్ చేస్తోంది.

ఆమె ఇప్పుడు చేస్తున్న సినిమాలలో ఇదే భారీ సినిమా. ఇది తప్పకుండ ఆమెకు మంచి హిట్ ను తెచ్చి పెడుతుందని అందరు భావిస్తున్నారు. ఏదేమైనా ప్రభాస్ సలార్ సినిమా ను లీక్ లు కాకుండా చేసే విషయంలో స్ట్రిక్ట్ గా ఉండకుండా పెద్ద తప్పు చేస్తున్నాడని చెప్పొచ్చు.  కేజీఎఫ్ మూవీని నిర్మించిన నిర్మాణ సంస్థ హోంబ‌లే ఫిలింస్  సలార్ చిత్రాన్ని నిర్మిస్తోంది. కెజిఎఫ్ సినిమా కు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ సినిమా రూపొందుతుంది. ఇప్పటికే లుక్స్ ని బట్టి ఇది తెలుస్తుంది.  పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, మధు గురుస్వామి, ఈశ్వరీ రావు కీలక పాత్రలు పోషిస్తు్న్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: