ఇప్పటివరకు సౌత్ ఇండియా నుండి భారీ అంచనాల నడుమ ఎన్నో మూవీలు విడుదల అయ్యాయి. అందులో కొన్ని మూవీలకు మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్లు కూడా దక్కాయి. అలా సౌత్ ఇండియా నుండి విడుదల అయ్యి మొదటి రోజు అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 10 మూవీల గురించి తెలుసుకుందాం.

రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ ,  జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా తేలకెక్కిన ఆర్ ఆర్ ఆర్ మూవీ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 235 కోట్ల కలెక్షన్లను సాధించింది. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన బాహుబలి 2 మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 215 కోట్ల కలెక్షన్లను సాధించింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యాష్ హీరోగా తెరకెక్కిన కేజీఎఫ్ చాప్టర్ 2 మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 164.20 కోట్ల కలెక్షన్ లను సాధించింది. ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన సాహో మూవీ ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు 126 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన రోబో 2.0 సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల కలెక్షన్లను సాధించింది.

రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన కబాలి మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 87.5 కోట్ల కలెక్షన్లను సాధించింది. దళపతి విజయ్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో దొరకెక్కిన బీస్ట్ మూవీ ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు 86.15 కోట్ల కలెక్షన్లను సాధించింది. చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తలకెక్కిన సైరా నరసింహారెడ్డి మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 85 కోట్ల కలెక్షన్లను సాధించింది. మణిరత్నం దర్శకత్వంలో చయాన్ విక్రమ్ ,  కార్తీ ,  జయం రవి ,  ఐశ్వర్యా రాయ్ ,  త్రిష ప్రధాన పాత్రలలో తెరకెక్కిన పొన్నియన్ సెల్వన్ మూవీ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 82.30 కోట్ల కలెక్షన్లను సాధించింది. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన బాహుబలి 1 మూవీ ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు 73.40 కోట్ల కలెక్షన్లను సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: