టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయినటు వంటి నాగ చైతన్య గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాగ చైతన్య ఇప్పటికే ఎన్నో విజయవంతమైన మూవీ లలో హీరోగా నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ను దక్కించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే నాగ చైతన్య ఈ సంవత్సరం ప్రారంభంలో బంగార్రాజు మూవీ తో మంచి విజయాన్ని అందుకున్నాడు.

ఆ తర్వాత విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన థాంక్యూ మూవీ లో హీరోగా నటించాడు. అలాగే అమీర్ ఖాన్ హీరోగా కరీనా కపూర్ హీరోయిన్ గా తెరకెక్కిన హిందీ సినిమా లాల్ సింగ్ చడ్డా లో ఒక కీలక పాత్రలో నటించాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నాగ చైతన్య ,  విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దూత అనే వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నాగ చైతన్య 'దూత' వెబ్ సిరీస్ తో పాటు తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఒక మూవీ లో కూడా హీరో గా నటిస్తున్నాడు.

మూవీ లో కృతి శెట్టి ,  నాగ చైతన్య సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ,  ఇళయరాజా ,  యువన్ శంకర్ రాజా ఈ మూవీ కి సంగీతాన్ని అందిస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయ్యింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వ్వేగంగా జరుగుతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగ చైతన్య , వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్లు తెలియజేశాడు. అలాగే ఈ మూవీ లో తన పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉండబోతున్నట్లు కూడా నాగ చైతన్య చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: