తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అదిరి పోయే రేంజ్ మాస్ ఇమేజ్ కలిగిన హీరో లలో ఒకరు అయిన మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలలో నటించి తన నటనతో ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకుని ఆ తర్వాత హీరోగా అవకాశాలను దక్కించుకొని ఆ తర్వాత వరస మాస్ మూవీ లలో హీరోగా నటించి ప్రస్తుతం రవితేజ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మాస్ హీరోగా కెరీర్ ని కొనసాగిస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే రవితేజ ఇప్పటికే ఈ సంవత్సరం ఖిలాడి ,  రామారావు ఆన్ డ్యూటీ మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. ఇది ఇలా ఉంటే రవితేజ ఇప్పటికే త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ధమాకా మూవీ షూటింగ్ ని పూర్తి చేశాడు. ఈ మూవీ మరి కొన్ని రోజుల్లోనే విడుదల కాబోతుంది. ఈ మూవీ లో యంగ్ బ్యూటీ శ్రీ లీల రవితేజ సరసన హీరోయిన్ గా నటించింది. అలాగే రవితేజ ప్రస్తుతం రావణాసుర ,  టైగర్ నాగేశ్వరరావు మూవీ లలో హీరోగా నటిస్తున్నాడు.

వీటితో పాటు మెగాస్టార్ చిరంజీవి హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా బాబీ దర్శకత్వంలో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో తేరక్కెక్కుతున్న మూవీ లో ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే మాస్ మహారాజా రవితేజ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న నిర్మాణ సంస్థలలో ఒకటి అయినా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కబోయే ఒక మూవీ లో హీరో గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరి కొన్ని రోజుల్లోనే రాబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: