యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే ఈ సంవత్సరం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ మూవీ తో అద్భుతమైన బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా హీరోగా నటించాడు. ఇలా ఆర్ ఆర్ ఆర్ మూవీ తో అద్భుతమైన విజయాన్ని అందుకొని అద్భుతమైన క్రేజ్ ని సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి మూవీ ని కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్నాడు.

మూవీ జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో 30 వ మూవీ గా తెరకెక్కబోతుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఈ మూవీ లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సరికొత్త స్లిమ్ లుక్ లో కనబడడం కోసం దాదాపు 8 కిలోల బరువు తగ్గబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీ లో రష్మిక మందన లేదా కీర్తి సురేష్ లలో ఎవరో ఒకరు ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ 30 వ మూవీమూవీ కి సంబంధించిన ఒక అదిరిపోయే న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... జూనియర్ ఎన్టీఆర్ తన 30 వ మూవీ లో స్టూడెంట్ లీడర్ పాత్రలో కనిపించబోతున్నట్లు , అలాగే ఈ మూవీ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ మూవీ గా రూపొందబోతునట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ ,  కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన జనతా గ్యారేజ్ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో వీరిద్దరూ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రెండవ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: