టాలీవుడ్ యంగ్ హీరోయిన్ లలో ఒకరు అయిన శ్రీ లీల గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ పెళ్లి సందD మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇచ్చింది. ఈ ముద్దు గుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ తోనే అద్భుతమైన క్రేజ్ ని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంపాదించుకుంది. పెళ్లి సందD మూవీ లో ఈ ముద్దు గుమ్మ తన అందంతో ,  నటన తో ,  డాన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేయడంతో ఈ ముద్దు గుమ్మ కు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వరుస క్రేజీ అవకాశాలు దక్కుతున్నాయి.

అందులో భాగంగా ఇప్పటికే శ్రీ లీల ధమాకా మూవీ లో రవితేజ సరసన హీరోయిన్ గ నటించింది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ధమాకా మూవీ షూటింగ్ ఎప్పటికీ పూర్తి అయింది. ఇది ఇలా ఉంటే ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తన కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న శ్రీ లీల తాజాగా మరో క్రేజీ పాన్ ఇండియా మూవీ లో అవకాశాన్ని దక్కించుకుంది. రామ్ పోతినేని , బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఒక భారీ యాక్షన్ పాన్ ఇండియా మూవీ తెరకెక్కబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ఈ రోజు నుండి ప్రారంభం అయింది. ఈ మూవీ కి ఎస్ ఎస్ తమన్ సంగీతాన్ని అందించబోతున్నాడు.

ఇది ఇలా ఉంటే శ్రీ లీల ఇలా భారీ పాన్ ఇండియా మూవీ లో అవకాశాన్ని దక్కించుకుంది. ఈ మూవీ కనుక మంచి విజయం సాధించినట్లు అయితే ఈ ముద్దుగుమ్మ క్రేజ్ పాన్ ఇండియా రేంజ్ లో అమాంతం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే శ్రీ లీల తాజాగా నటించిన ధమాకా మూవీ విడుదల తేదీని మరి కొన్ని రోజుల్లోనే ప్రకటించే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: