ఇటీవల కాలంలో సౌత్ కంటే బాలీవుడ్ పరిశ్రమ బాగా వెనుకబడి పోయింది.. మన సౌత్ నుండి పాన్ ఇండియా సినిమాలతో వరుస రిలీజ్ లు అవ్వడమే కాకుండా ఆ సినిమాలు చాలా వరకు ఆకట్టు కోవడం భారీ కలెక్షన్స్ రాబట్టడం వంటివి జరుగుతూనే ఉన్నాయి.
అయితే అదే సమయంలో బాలీవుడ్ కు మాత్రం అస్సలు కలిసి రావడం లేదు.. వచ్చిన ప్రతీ సినిమాను ప్లాప్ చేస్తున్నారు అక్కడి ప్రేక్షకులు..

అయితే ఇటీవలే బాలీవుడ్ లో రిలీజ్ అయినా బ్రహ్మాస్త్ర సినిమా హిట్ అవ్వక పోయిన భారీ ఓపెనింగ్స్ రాబట్టి ఊపిరి పోసింది.. ఎంత ఓపెనింగ్స్ రాబట్టిన ఈ సినిమా కూడా నష్టాలు చూడక తప్పలేదు..అయితే ఇప్పుడు మరోసారి బాలీవుడ్ ను పెద్ద సినిమా రాబోతుంది.. సెప్టెంబర్ 30న బాలీవుడ్ నుండి విక్రమ్ వేద రిలీజ్ కాబోతుంది.. ఇది అతి పెద్ద మల్టీ స్టారర్ గా తెరకెక్కించారు. అయితే ఈ సినిమాకు మినిమమ్ బజ్ కూడా క్రియేట్ అవ్వక పోవడం మళ్ళీ బాలీవుడ్ ను కలవరపాటుకు గురి చేస్తుంది.

ఎంత ప్రోమోట్ చేసిన ఈ సినిమాకు అనుకున్న బజ్ అయితే రాలేదు..

అసలు ఈ సినిమా రిలీజ్ కాబోతుంది అని.. ప్రొమోషన్స్ చేస్తున్నారు అని చాలా మందికి తెలియక పోవడం గమనార్హం.. బాలీవుడ్ లో కాస్త అడ్వాన్స్ బుకింగ్స్ జరిగినా ఓవర్సీస్ లో మాత్రం అసలు అడ్వాన్స్ బుకింగ్స్ నమోదు అవ్వడం లేదని.. అక్కడ ఈ సినిమా పరిస్థితి దారుణంగా ఉంది అని తెలుస్తుంది. అదే సమయంలో తమిళ్ సినిమాలకు బాగా అడ్వాన్స్ బుకింగ్స్ జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. తమిళ్ నుండి సెప్టెంబర్ 30న రెండు సినిమాలు రిలీజ్ కాబోతున్నారు. ఈ రెండు సినిమాలకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ విక్రమ్ వేద సినిమాకు జరగక పోవడం బాలీవుడ్ పరిస్థితికి అద్దం పడుతుంది.. బాలీవుడ్ సినిమా అందులోను మల్టీ స్టారర్ సినిమాకు ఇలాంటి ఒక అనుభవం జరగడంతో మళ్ళీ సౌత్ ముందు తేలిపోక తప్పలేదు.. పరిస్థితి ఇలానే కొనసాగితే ఇది కూడా ప్లాప్ లిష్టులోకి చేరిపోవడం ఖాయం.. ఈ సినిమాకు మౌత్ టాక్ బాగా వస్తేనే ప్రేక్షకులు చూసే అవకాశం ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి: