మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరస మూవీ లలో నటిస్తూ ఫుల్ జోష్ లో కెరీర్ ని ముందుకు సాగిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి ఈ సంవత్సరం మొదట ఆచార్య మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఇది ఇలా ఉంటే తాజాగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన గాడ్ ఫాదర్ మూవీ అక్టోబర్ 5 వ తేదీన చాలా గ్రాండ్ గా తెలుగు మరియు హిందీ భాషల్లో విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర మంచి టాక్ లభించడంతో ప్రస్తుతం గాడ్ ఫాదర్ మూవీ కి అద్భుతమైన కలెక్షన్ లు దక్కుతున్నాయి.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం చిరంజీవి , బాబి దర్శకత్వంలో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఒక మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ మూవీ లో మాస్ మహారాజ రవితేజ కూడా ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ కి ఇప్పటివరకు చిత్ర బృందం టైటిల్ ని ప్రకటించకపోవడంతో ఈ మూవీ చిరంజీవి కెరియర్ లో 154 వ మూవీ గా తెరకెక్కుతూ ఉండడంతో , ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మెగా 154 అనే వర్కింగ్ టైటిల్ తో జరుగుతుంది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి  వెళితే ...  మెగా 154 మూవీ టీజర్ ను ఈ సంవత్సరం దీపావళి సందర్భంగా విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: