కోలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయిన శివ కార్తికేయన్ తాజాగా ప్రిన్స్ అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయిన అనుదీప్ కే వీ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన కొన్ని ప్రచార చిత్రాలను మరియు పాటలను విడుదల మూవీ యూనిట్ విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. దానితో ఈ మూవీ పై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని తెలుగు మరియు తమిళ భాషలలో ఒకే సారి విడుదల చేయనున్నారు. 

మూవీ ని అక్టోబర్ 21 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ ట్రైలర్ ని ఈ రోజు అనగా అక్టోబర్ 9 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తాజాగా అధికారికంగా ప్రకటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే ప్రిన్స్ మూవీ యూనిట్ తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్ ని టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరి పోయే క్రేజ్ ఉన్న హీరో లలో ఒకరు అయిన విజయ్ దేవరకొండ విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ని కూడా విడుదల చేసింది.

ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి తమన్ సంగీతాన్ని అందించాడు. ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని పాటలను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తుంది. ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న ప్రిన్స్ మూవీ బాక్సా ఫీస్ దగ్గర ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: