కొందరు మంచి కంటెంట్ ఉంటే సినిమా చూడడానికి ఇష్టపడతారు. కానీ మరి కొంతమంది ప్రతి వారం వచ్చిన సినిమాలను చూడటానికి ఇష్టపడతారు. నిజానికి అది వారికి ఒక వ్యసనం అని చెప్పవచ్చు.
అలా వచ్చేవారం ఏ సినిమా విడుదలవుతుందో అని ముందుగానే సర్చ్ లు చేసి వారం ముందే హడావుడిగా కనిపిస్తూ ఉంటారు. ముందుగానే టికెట్లు బుక్ చేసి సినిమా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇక అలాంటి వారి కోసం తీపి కబురు అని చెప్పవచ్చు. అదేంటంటే ఈ వారం ఓటీటీలో వరుస సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి.
ప్రస్తుతం థియేటర్ల కంటే ఎక్కువగా ఓటీటీ ప్రభావం ఉన్న సంగతి తెలిసిందే. నిజానికి చాలామంది థియేటర్లో విడుదలయ్యే సినిమాల కంటే ఓటీటీ లో విడుదలయ్యే సినిమాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఓటీటీ బాగా అలవాటయింది. థియేటర్లోకి వెళ్లి చూడటం కంటే ఇంట్లోనే కూర్చుని తమకు నచ్చిన సినిమాలు చూడటానికి ఇష్టపడుతున్నారు.
థియేటర్లో విడుదలైన కొన్ని రోజులకే ఓటీటీ లో కూడా తొందరగానే స్ట్రీమింగ్ కావడంతో ప్రేక్షకులు కాస్త ఆలస్యమైన సరే అని ఓటీటీ లో చూడటానికి ఇష్టపడుతున్నారు. ఇక ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఏంటో తెలుసుకుందాం.
అందులో జీ5 లో ప్రసారం అవుతున్న సినిమా వెబ్ సిరీస్: కల్యాణ్‌రామ్ నటించిన 'బింబిసార' అక్టోబరు 21 న స్ట్రీమింగ్ కానుంది. ట్రిప్లింగ్ అనే హిందీ సిరీస్- 3 అక్టోబరు 21 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇక సోనీలివ్ లో ప్రసారం అవుతున్న సినిమా ఏంటంటే.. శర్వానంద్, నటించిన ఒకే ఒక జీవితం. ఈ సినిమా అక్టోబరు 21 నుంచి స్ట్రీమింగ్ కానుంది
ఇక నెట్‌ఫ్లిక్స్ లో ద స్కూల్ ఫర్ గుడ్ అండ్ ఈవిల్ అనే హాలీవుడ్ మూవీ అక్టోబరు 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇక బార్బేరియన్స్ అనే వెబ్‌సిరీస్-2 అక్టోబరు 21 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇక ఫ్రమ్ స్క్రాచ్ అనే వెబ్‌సిరీస్ అక్టోబరు 21 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
అమెజాన్ ప్రైమ్ లో అమ్ము అక్టోబరు 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ద పెరిఫెరల్ అనే వెబ్‌సిరీస్ అక్టోబరు 21 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఫోర్ మోర్ షాట్స్ అనే వెబ్‌సిరీస్ అక్టోబరు 21నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఆహా లో ప్రసారం అవుతున్న సినిమా పెట్టైకాలి అనే తమిళ సినిమా కూడా అక్టోబరు 21వ నుంచి స్ట్రీమింగ్ కానుంది. మొత్తానికి ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమాలు ఇవే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి