హిం దీ సినిమాలు ఈ మధ్య కాలం లో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోతున్నాయి. వందల కోట్ల బడ్జెట్ తో రూపొందిన స్టార్ హీరోసినిమా లు మరియు సూపర్ స్టార్ హీరోల భారీ బడ్జెట్ చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతూ కలెక్షన్స్ విషయం లో తీవ్ర నిరాశ కు గురవుతున్నాయి.పెద్ద ఎత్తున నిర్మాణం జరిగిన హిందీ సినిమా లో చాలా వరకు ఈ మధ్య బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశ పరిచిన విషయం తెలిసిందే. తాజాగా రెండు డబ్బింగ్ సినిమాలు మాత్రం హిందీ బాక్సాఫీస్ వద్ద తెగ సందడి చేశాయి. హిందీ ఫిలిం మేకర్స్ చూసి ముక్కున వేలేసుకునే విధంగా కార్తికేయ 2 మరియు కాంతార చిత్రాలు బాక్సాఫీస్ వద్ద గల గల లాడించాయి. హిందీ ప్రేక్షకులను భలే ఆకట్టుకున్నాయి.

ఈ రెండు సినిమా లు కూడా 30 కోట్ల కు పైగా షేర్ కలెక్షన్స్ ని రాబట్టి బాబోయ్ అనిపించాయి. ఈ స్థాయి లో డబ్బింగ్ సినిమా లు.. అది కూడా ప్రమోషన్ లేకుండా రాబట్టడం మామూలు విషయం కాదు. గత సంవత్సరం అల్లు అర్జున్ హీరో గా నటించిన పుష్ప సినిమా హిందీ లో పబ్లిసిటీ చేయకుండానే 100 కోట్ల కలెక్షన్స్ నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ రెండు సినిమా లు కూడా 30 కోట్ల కు పైగా కలెక్షన్స్ నమోదు చేయడం తో అంతా అవాక్కయ్యారు. ప్రస్తుతం కాంతార సినిమా కు సంబంధించిన కలెక్షన్స్ భారీగా వస్తున్నాయి. కనుక బాక్సాఫీస్ వద్ద ఫలితం చాలా ఆశాజనకంగా ఉంది. హిందీ సినిమా లు రాబట్టలేని కలెక్షన్స్ సౌత్ సినిమా లు డబ్బింగ్ అయి రాబడుతున్న కలెక్షన్స్ చూసి ఫిలిం మేకర్స్ ముక్కున వేలేసుకుంటున్నారు. ముందు ముందు కూడా సౌత్ సినిమా లు బాలీవుడ్ బాక్సాఫీస్ వద్దసందడి చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: